Ramya Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న రమ్యకృష్ణ (Ramya Krishna)తాజాగా జగపతిబాబు (Jagapathi బాబు) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హిట్ ఫ్లాపులు రావడం సర్వసాధారణం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంతోమంది ఈ విషయంపై ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నారు.
సెలబ్రిటీలు నటించిన సినిమాలు వరుసగా హిట్ అయితే వారిని ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తారు. అదే వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడితే ఐరన్ లెగ్(Iron Leg) అంటూ ట్రోల్స్ చేస్తారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఐరన్ లెగ్ అంటూ విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నట్లు తాజాగా జగపతిబాబు కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది నన్ను ఐరన్ లెగ్ అంటూ విమర్శించారని ఈమె ఎమోషనల్ అయ్యారు.
తాను భలే మిత్రులు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సినిమాలపై ఆసక్తితో చదువుకుంటున్న సమయంలోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చాను అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో వరుసగా ఫ్లాప్ సినిమాలు నన్ను వెంటాడటంతో అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. దీంతో ఇంట్లో వాళ్ళు కూడా సినిమాలు ఆపేసి చదువుపై దృష్టి పెట్టమని సలహాలు ఇచ్చారు. కానీ నాకు సినిమాలు అంటే చాలా ఆసక్తి ఉండేది అదే సమయంలోనే తాను ఒక జ్యోతిష్యుడిని కలిశానని రమ్యకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆ జ్యోతిష్యుడు నా జాతకం చూసి పెద్ద స్టార్ అవుతానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు.
విలన్ గా మెప్పించిన రమ్యకృష్ణ..
ఈ విధంగా జ్యోతిష్యుడు ఇండస్ట్రీలో తాను గొప్ప హీరోయిన్ అవుతానని చెప్పడంతో తిరిగి తాను యాక్టింగ్ స్కూల్లో చేరి మరింత శిక్షణ తీసుకున్నాను అని తెలిపారు.. చివరికి జ్యోతిష్యుడు చెప్పిన విధంగానే ఇండస్ట్రీలో నాకు సక్సెస్ వచ్చిందని ఈమె తెలిపారు. తాను 1984 వ సంవత్సరంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే 1991 వ సంవత్సరంలో నాకు మొదటి సక్సెస్ వచ్చిందని తెలిపారు.ఈ సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలో తాను వెనక్కి తిరిగి చూసుకోలేదని రమ్యకృష్ణ తన కెరీర్ గురించి, కెరియర్లు ఎదుర్కొన్న అవమానాలు గురించి తెలిపారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!