BigTV English
Advertisement

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : పుట్టుకతోనే ఎవరూ నేరస్తులు కారు. పెరిగిన వాతావరణం, పరిస్థితులు వల్ల నేరాల బాట పడుతుంటారు. ఇందుకు ఒక ఉదాహరనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే డాక్యుమెంటరీ. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ స్టోరీలో ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి. ఒక అమ్మాయి క్రూరమైన క్రిమినల్ గా ఎలా మారిందనేది ఈ డాక్యుమెంటరీ చూపిస్తుంది. పుట్టినప్పటినుంచి ఆమె పడిన నరకం, టీనేజ్ నుంచి హత్యలతో ఆమె జీవితం ఎలా ఉండేదో ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఆమె అమెరికాలో మొదటి మహిళ సీరియల్ కిల్లర్ కావడం విశేషం. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ఐలీన్: క్వీన్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్స్’ (Aileen : Queen of the Serial Killers) 2025 అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైమ్ డాక్యుమెంటరీ. BBC స్టూడియోస్, NBC న్యూస్ స్టూడియోస్ నిర్మాణంలో డైరెక్టర్ ఎమిలీ టర్నర్ దీనిని రూపొందించారు. ఇది ఐలీన్ వూర్నోస్ అనే ఒక మహిళ జీవితం, క్రైమ్స్ గురించి చూపిస్తుంది. ఆమె అమెరికాలో ఒక డేంజర్ సీరియల్ కిల్లర్. 1989 -90 మధ్య 7 మంది పురుషులను చంపింది.1 గంట 20 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి ఐయండిబిలో 7.5/10 రేటింగ్ ఉంది.

స్టోరీ ఏమిటంటే

ఐలీన్ వూర్నోస్ 1956లో మిచిగాన్‌లో పుట్టింది. తల్లి డయాన్ 17 ఏళ్లలో పెళ్లి చేసుకుంది. తండ్రి లియో డేల్ ఒక చైల్డ్ మొలెస్టర్. ఐలీన్ పుట్టిన 6 నెలలకు తల్లి విడాకులు తీసుకుంది. పిల్లలను వేధించిన కేసులో తండ్రి జైలుకు వెళ్ళి , ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. 4 ఏళ్లకు తల్లి ఐలీన్ ని ఆమె గ్రాండ్‌పారెంట్స్ వద్ద వదిలేసింది. అక్కడ కూడా ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. గ్రాండ్‌ఫాదర్ ఐలీన్‌ను సెక్సువల్ అబ్యూస్ చేశాడు. 11 ఏళ్లకు స్కూల్ బాయ్స్‌తో డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకుంది. 13 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయింది. బేబీని వేరే వాళ్ళకి ఆడాప్ట్ చేశారు. 15 ఏళ్లకు గ్రాండ్‌మదర్ చనిపోయింది. ఆ తరువాత గ్రాండ్‌ఫాదర్ ఆమెను ఇంటి నుండి బయటకు తరిమేశాడు.


Read Also : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

అప్పటి నుంచి ఐలీన్ స్ట్రీట్‌లో జీవించింది. ఆకలికి ప్రాస్టిట్యూషన్ మొదలు పెట్టింది. 20 ఏళ్లకు బాగా డబ్బున్న ఓల్డ్ మ్యాన్ లూయిస్ తో పెళ్లి జరిగింది. అయితే 9 వారాల్లో నే విడాకులు తీసుకున్నారు. 1986లో టైరియా మూర్ అనే వ్యక్తి పరిచేయంతో హత్యల వరకు వెళ్తుంది. ఇద్దరూ హైవేలో ప్రాస్టిట్యూషన్ చేయడం మొదలు పెడతారు. ఇక1989 డిసెంబర్ 1న మొదటి మర్డర్ చేస్తుంది. రిచర్డ్ మాల్ అనే 51ఏళ్ల ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ ను ఐలీన్ హైవేలో గన్‌తో షూట్ చేసి, మనీ, కార్ దొంగిలించింది. ఆ తర్వాత ఒకే సంవత్సరంలో 6 మందిని చంపింది.

1990లో పోలీసులు ఐలీన్ ఫింగర్‌ప్రింట్స్ కనుక్కున్నారు. 1991 జనవరి 9న ఒక బార్‌లో అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. మొదట సెల్ఫ్-డిఫెన్స్ అని చెప్పి, తర్వాత నేనే చంపానని చెప్తుంది. 2002 అక్టోబర్ 9న ఫ్లోరిడా జైలులో లెథల్ ఇంజెక్షన్‌తో ఆమెకు మరణ శిక్ష విధించారు. అప్పటికి ఆమె వయసు 46 ఏళ్లు. చివరికి ఐలీన్ బాధితురాలా? కిల్లరా? అబ్యూస్ ఆమెను మార్చిందా ? అనే ప్రశ్నిలకు సమాధానాలను తెలుసుకోవాలంటే, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.

 

Related News

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఒకే రోజు ఓటీటీని షేక్ చేయబోతున్న రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ”లోకా చాప్టర్ 1: చంద్ర’… ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసా?

OTT Movie : భర్త ఫ్రెండ్ తోనే ఆ పాడు పని… మైండ్ బెండింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… డోంట్ మిస్

OTT Movie : భర్త లేని టైమ్ లో భార్య గదిలోకి… ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి కన్పిస్తే కథ కంచికే… పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×