Lokesh Kangaraj -Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా ఈయన సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలలో కూడా నటించాల్సి ఉంది. వీటితో పాటు ఫౌజీ సీక్వెల్ ది రాజా సాబ్ సీక్వెల్ కూడా రాబోతోంది అంటూ ప్రభాస్ సినిమాల గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ సినిమాలకు సంబంధించి మరొక వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ మరో స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.. కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఒకరు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదని చెప్పాలి. అయితే తాజాగా లోకేష్ కనగ రాజ్ ప్రభాస్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారని, దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మాత్రం ఐదు సంవత్సరాల తరువాతనే షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.
లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చడంతో ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అన్నింటిని పూర్తి చేసిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి రాబోతోందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరి లోకేష్ ఈ సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం చేయబోతున్నారా?లేదంటే తన సినిమాటిక్ యూనివర్స్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ప్రభాస్..
ఇక లోకేష్ కనగ రాజ్రజనీకాంత్ హీరోగా కూలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సుమారు 600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఖైతీ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లోకేష్ తన సినిమాలన్నింటినీ పూర్తి చేసిన అనంతరమే ప్రభాస్ తో సినిమా చేయబోతున్నారు. ఇక ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఫౌజీ సినిమాని కూడా 2026 ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారు. ఇక నవంబర్ నెల నుంచి ప్రభాస్ స్పిరిట్ సినిమా పనులలో కూడా బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.