BigTV English
Advertisement

OTT Movie : వర్షంలో లిఫ్ట్ అడిగే అమ్మాయి… స్ట్రేంజర్స్ కన్పిస్తే పారిపోయేలా చేసే మూవీ… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వర్షంలో  లిఫ్ట్ అడిగే అమ్మాయి… స్ట్రేంజర్స్ కన్పిస్తే పారిపోయేలా చేసే మూవీ… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : కానిబల్స్ అడవి ప్రాంతాల్లో నాగరికతకి దూరంగా ఉంటారని చెప్పుకుంటారు. రియల్ గా కూడా ఇప్పటికీ అమెజాన్ అడవులలో ఉన్న ఆనవాళ్ళు కూడా కనపడ్డాయి. ఇంత వరకూ ఫర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు. మనం అక్కడికి పోము. అయితే మనుషుల మధ్య ఉండే నారామాంస భక్షకులతో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. నాగరికతలో ఉంటూ, అనాగరికంగా ప్రవర్తించే ఒక సైకో ఫ్యామిలీ కథనే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాలో ఒక ఫ్యామిలీ మనుషుల్ని ట్రాప్ చేస్తూ. వాళ్ళని మటన్ ముక్కల్లా ఆరగిస్తుంటారు. క్లైమాక్స్ మరింత దారుణంగా ఉంటుంది. పిల్లలతో అస్సలు చూడొద్దు. ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘మాకబ్రే’ (Macabre) 2009లో విడుదలైన ఇండోనేషియన్ స్లాషర్ హారర్ ఫిల్మ్. దీన్ని కిమో స్టాంబోల్, టిమో తజాంటో (ది మో బ్రదర్స్) డైరెక్ట్ చేశారు. ఇది 2007లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘డారా’ ఎక్స్‌పాన్షన్. లీడ్ రోల్స్‌లో షరీఫా దానిష్ (దారా), జూలీ ఎస్టెల్ (ఆస్ట్రిడ్), ఏరియో బాయు (అడ్జీ) నటించారు. 1 గంట 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఆక్టోబర్ 2009లో సింగపూర్‌లో థియేటర్స్‌లో విడుదలైంది. ఐయండిబిలో 6.4/10 రేటింగ్ తో యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, ప్లెక్స్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

అడ్జీ, ఆస్ట్రిడ్ అనే జంటకి కొత్తగా పెళ్లి అవుతుంది. వాళ్లు జింగ్గా, ఎల్మా, లెస్టర్ అనే ఫ్రెండ్స్ తో కలసి కారులో జాకార్టా కి వెళ్తుంటారు. అయితే దారి మధ్యలో కారు పంక్చర్ అవుతుంది. మాయా అనే ఒక అందమైన అమ్మాయి వీళ్ళ దగ్గరికి వస్తుంది. నా బ్యాగ్, మనీ దొంగలు తీసుకుని పారిపోయారని, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. వర్షం కూడా పడుతుండటంతో అడ్జీ గ్రూప్ జాలి పడి ఆమెను కారులో ఎక్కిస్తారు. మాయా ఇళ్ళు రాగానే, లోపలికి వచ్చి డిన్నర్ చేసి వెళ్లండి అని చెబుతుంది. వీళ్ళు కూడా సరేనని అంటారు. ఇల్లు ఒక పాత బంగ్లా మాదిరి ఉంటుంది. మయా అమ్మ దారా వాళ్లకు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళు కూడా హాయిగా ఆరగిస్తారు. కానీ ఆ ఫుడ్‌లో మందు మిక్స్ చేసి ఉండటంతో అందరూ నిద్రపోతారు.


Read Also : పిల్లల పెళ్ళిళ్ళను చెడగొట్టే దిక్కుమాలిన ఆచారం… కడుపుబ్బా నవ్వించే మలయాళం కామెడీ థ్రిల్లర్

ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మెలుకువలోకి వచ్చాక చూస్తే, కాళ్లు చేతులు బంధించి ఒక రూమ్‌లో లాక్ చేసి ఉంటారు. దారా, మాయా, వీళ్ళ కుమారులు కలిసి వీళ్ళను తినటం మొదలు పెడతారు. మొదట జింగ్గాను కత్తితో కట్ చేసి, గుండె తీసి తింటారు. ఎల్మా, లెస్టర్ లను కూడా చంపి తింటారు. అడ్జీ, ఆస్ట్రిడ్ భయంతో వణికిపోతారు. అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. అక్కడ ఒక భీకరమైన పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో అడ్జీ, ఆస్ట్రిడ్ జంట బతుకుతారా ? ఆ సైకో ఫ్యామిలీ చేతిలో బలవుతారా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వెర్రివేశాలేసే సైకో .. రాత్రయితే ఫ్యామిలీ అంటూ నరకం… ఆ పాడు పనులన్నీ ఒకే గదిలో

OTT Movie : మొగుడిని వదిలేసి మరొకడితో… ముసలి వాళ్లను నరికి చంపే లేడీ సైకో… ఒళ్ళు గగుర్పొడిచే సీరియల్ కిల్లర్ మూవీ

OTT Movie : డీమాన్ దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్ ను పంచుకునే సైకో… ముగ్గురూ కలిసి ఒకే అమ్మాయితో… ఆ పిల్ల రివేంజ్ చూస్తే గూస్ బంప్స్

The Family Man 3 OTT: ఎట్టకేలకు ఓటీటీకి ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

OTT Movie : పెళ్ళాల గొడవలతో దూరమయ్యే ప్రాణ స్నేహితులు… పిల్లలిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్… కితకితలెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ప్రతీ 5 నిమిషాలకు ఆ ఇంటెన్షన్ ఉన్న టెన్షన్ పెట్టే సీన్.. .సింగిల్స్ కు పండగే

Big Stories

×