Ramcharan -Upasana: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి. సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్(Ramcharan) ఉపాసన(Upasana) మరో అడుగు ముందుకు వేసి మరో గొప్ప సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే .అయితే ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గం అభివృద్ధి కోసం రామ్ చరణ్ ఉపాసన ముందుకు వచ్చారు..
పిఠాపురం నియోజకవర్గంలో చిన్నారుల ఆరోగ్యం విద్య పోషణను దృష్టిలో పెట్టుకొని అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఒక మోడల్ అంగన్వాడి పాఠశాలను నిర్మిస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటుంది. ప్రాంతాలలో ఉండే చిన్నారులకు కార్పొరేట్ స్థాయి వసతులు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని నివారించడం కోసం ,మెరుగైన వైద్యం అందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించనున్నారు. అపోలో హాస్పిటల్ భాగస్వామ్యంతో రామ్ చరణ్ ఉపాసన అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Center) నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ అంగన్వాడి కేంద్రం మరొక రెండు నెలలు పూర్తి కాబోతుందని ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా ఈ అంగన్వాడీ కేంద్రం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ప్రజల కోసం మెగా కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మెగా మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఉపాసన అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా రామ్ చరణ్ ఉపాసన ఒకవైపు వారి వృత్తిపరమైన వ్యవహారాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక త్వరలోనే సుకుమార్ డైరెక్షన్లో ఈయన బిజీ కాబోతున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోందని సమాచారం.దసరా పండుగ సందర్భంగా పూజ కార్యక్రమాలను ప్రారంభం చేసుకుని తదుపరి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా అంటేనే పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పటికి మీరు కాంబినేషన్లో రంగస్థలం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!