Pavala Syamala Daughter: సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాలలో నటిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె చివరి దశ చాలా భారంగా మారిందని చెప్పాలి. ఉండటానికి సొంత గూడు లేక అనాధాశ్రమంలో జీవితాన్ని కొనసాగిస్తూ అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇలా పావలా శ్యామల మరణించడంతో ఆమె కుమార్తె మాధవి పరిస్థితి అగమ్య గోచరంగ మారిపోయింది. పూర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాధవి ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.
ఈ నేపథ్యంలోనే శ్యామల కూతురు మాధవికి సాయం చేయడం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో సమావేశమైన ఈసీ కమిటీ మాధవికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం నడవలేని పరిస్థితులలో వీల్ చైర్ కు పరిమితం అయినటువంటి మాధవికి ఏడాది పాటు చికిత్స అందిస్తామని మా అసోసియేషన్ తెలియజేసింది. నడవలేని స్థితిలో ఉన్న మాధవి తిరిగి సొంత కాళ్లపై నిలబడేలా ఎంత ఖర్చైనా ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచిత వైద్య సహాయంతో పాటు ఫిజియోథెరపీ అందించాలని మా అసోసియేషన్ నిర్ణయించింది.
అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఆర్టిస్టుల కుటుంబ సభ్యులను జీవితాంతం పోషించడం సాధ్యపడదు అందుకోసమే శ్యామల కూతురు వైద్య సహాయాన్ని ఒక ఏడాది కాలానికి మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఈ సమావేశంలో తెలియజేశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తన ఇష్ట ప్రకారం సురక్షితమైన ఆశ్రమంలో లేదా పునరావాస కేంద్రంలో చేర్చుతామని హామీ ఇచ్చారు. ఇలా పావలా శ్యామల మరణించిన తర్వాత ఆమె కుమార్తె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా అసోసియేషన్ ఈ విధమైనటువంటి కీలక నిర్ణయం తీసుకోవడంతో “మా” పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత రెండు నెలల క్రితం పావలా శ్యామల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు అయితే ఈమె మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దగ్గరుండి ఈమె అంత్యక్రియలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా శ్యామల అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం తన కుమార్తె మాధవి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలువురు సీనియర్ నటులు మురళీమోహన్ వి.కె. నరేష్ వంటి వారు వ్యక్తిగతంగా మాధవికి ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. పావలా శ్యామల మరణించినప్పటికీ తన కుమార్తెకు సినీ కుటుంబం అండగ ఉండటం అభినందనీయం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శివ బాలాజీ, కరాటే కళ్యాణి వంటి తదితరులు పాల్గొన్నారు.
Also Read: నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?