Anumana Pakshi Trailer:’డీజే టిల్లు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ డైరెక్టర్ విమల్ కృష్ణ (Vimal Krishna) దర్శకత్వంలో రాగ్ మయూర్ (Rag Mayur), మెరిన్ ఫిలిప్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మాణంలో సెప్టెంబర్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీకి దగ్గర పడుతున్న క్రమంలో చిత్ర బృందం సినిమాపై అంచనాలు పెంచడానికి ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ మొదలవగానే ఒక చిన్నారి వాయిస్ తో..” నీకు ఒక వింత పక్షి కథ చెబుతా విను” అంటూ ట్రైలర్ మొదలు పెడతారు.. రెండు పక్షులు మాట్లాడుకుంటుండగా .. అందులో ఒక పక్షి వీడెవడు? అని అడిగితే.. మరో పక్షి సమాధానమిస్తూ.. “కనిపించిన ప్రతి వ్యక్తిని, ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని అనుమానించి అందరి లైఫ్ ను కాంప్లికేట్ చేస్తాడు..అంటూ చెబుతుంది. కట్ చేస్తే రాగ్ మయూర్ తన పర్ఫామెన్స్ మొదలుపెట్టేశారు..
ఇందులో హీరోగా నటిస్తున్న రాగ్ మయూర్ అతి ఆలోచనతో.. బోలెడన్ని అనుమానాలతో ప్రతి విషయాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా అజయ్, సన్నీ పాత్రలో రాగ్ మయూర్ నటిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలోనే కాకుండా తన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని అనుమానపడుతూ ఉంటాడు . ఆఖరికి ప్రేమించిన అమ్మాయి విషయంలో చిన్న చిన్న విషయాలకు అనుమాన పడుతూ అనుమాన పక్షి అనిపించుకుంటాడు. ఇందులో ప్రతి ఒక్కరి నటన చాలా హిలేరియస్ గా చూపించారు.
ALSO READ:ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?
ముఖ్యంగా ట్రైలర్లో రాగ్ మయూర్ తనదైన శైలిలో నటిస్తూ నవ్వులు పూయించారు అమాయకత్వం, అయోమయం, అనుమానం కలగలిసిన పాత్రలో ఆయన నటన చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సన్నివేశాలలో టైమింగ్స్, హావభావాలతో మరోసారి తన విలక్షణ నటనను నిరూపించాడు రాగ్ మయూర్. సీనియర్ నటి రాశి, అజయ్, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్ లో కనిపించిన సన్నివేశాలను బట్టి చూస్తే.. కథలో కామెడీతో పాటు క్రైమ్ డ్రామా అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక అనుమానాస్పద పరిస్థితి చుట్టూ కథ సాగుతూ దాని నుంచి పుట్టే పరిణామాలు ప్రేక్షకులను నవ్వించేలా కనిపిస్తున్నాయి. మరి సెప్టెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ నుండి ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో చూడాలి.