E-Paper
Advertisement

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!
Advertisement

C.M.Vijay -Ajith: తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం విజయ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన లండన్ పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ కార్యకలాపాలలో భాగంగా లండన్ వెళ్లిన విజయ్ అక్కడే సిల్వర్ స్టోన్ కార్ రేసింగ్ లో పాల్గొన్నటువంటి తన మిత్రుడు, సినీ నటుడు అజిత్ కుమార్ ను కలిసిన సంగతి తెలిసిందే అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి. ఇలా తన స్నేహితుడు అజిత్ ను చూడగానే విజయ్ పరుగున వెళ్లి తనని హగ్ చేసుకుంటూ ఆత్మీయంగా పలకరించారు.

మీనియేచర్ కారును గిఫ్ట్ ఇచ్చిన విజయ్..

లండన్ లో నిర్వహించిన సిల్వర్ స్టోన్ కార్ రేసింగ్ ఈవెంట్లో కూడా సీఎం విజయ్ పాల్గొని సందడి చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విజయ్ అనంతరం నటుడు తన స్నేహితుడైన అజిత్ కుమార్ కు ఒక మీనియేచర్ కారును గిఫ్ట్ గా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. ఇలా మీనియేచర్ కారును గిఫ్ట్ గా అందిస్తూనే సీఎం విజయ్ దానిమీద తమిళంలో “ప్రియముడన్ (ప్రేమతో) విజయ్.. నా లవ్లీ బ్రదర్ అజిత్‌కు” అని రాసి కానుకగా ఇవ్వడంతో ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ కు అజిత్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.

రేసింగ్ హెల్మెట్ ఇచ్చిన అజిత్..

Advertisement

ఈ విధంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన స్నేహితుడు విజయ్ నుంచి ఈ అపురూపమైన కానుక రావడంతో వెంటనే అజిత్ సైతం తను వాడే ఒక రేసింగ్ హెల్మెట్‌పై “లవ్ అజిత్” అని రాసి ఇచ్చారు. ఇలా వీరిద్దరూ ఒకరికొకరు ఎంతో ప్రేమగా కానుకలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ ఘటన చూసిన అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ అజిత్ సినిమాల విషయానికి వస్తే దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీలు పడుతూ సినిమాలు చేశారు. ఇక ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కూడా అదే స్థాయిలో సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉండేది.

సినిమాలకు విజయ్ గుడ్ బై..

ఇలా సినిమాల పరంగా వీరి అభిమానుల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఇద్దరు హీరోలు ఇలా కలిసిపోవడంతో ఇద్దరి హీరోల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత పూర్తిగా సినిమాలను పక్కన పెట్టారు రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న ఈయన గత ఎన్నికలలో పోటీ చేయగా అద్భుతమైన విజయాన్ని అందుకొని తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇక అజిత్ విషయానికి వస్తే ఈయన ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రేసింగ్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా అజిత్ కెరియర్ లో 64 వ సినిమా కావటం విశేషం.

Advertisement

Also Read: డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Related News

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!

రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

Big Stories

Advertisement
×