Actor Suriya Tej: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శంభో శివ శంభో వినాయకుడు వంటి సినిమాలలో నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన సూర్య తేజ్(Suriya Tej) రచయితగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి”(nagpur pavitra tekdi ganapati ) అనే పుస్తకం తో ఈయన రచయితగా మారారు. ఈ నేపథ్యంలోను ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య తేజ్ ఈ పుస్తకం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
*శంభో శివ శంభో వినాయకుడు లాంటి సినిమాల తర్వాత రచయితగా మారడం, ఈ కొత్త ప్రయాణం ఎలా అనిపిస్తుంది?
సూర్య తేజ్: శంభో శివ శంభో సినిమా రిలీజ్ ఘనవిజయం సాధించడం చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రస్తుతం తాను కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఉన్నానని ఇప్పుడు రచయితగా ఈ కొత్త ప్రయాణం ఒక మైలురాయిగా భావిస్తున్నానని తెలిపారు.
*మీరు రాసిన తొలి పుస్తకం “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి” ప్రత్యేకత ఏమిటి?
సూర్య తేజ్: “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి” వైభవాన్ని,” తేక్డి గణపతి” చరిత్రను పుస్తక రూపంలో తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి రచయితగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది సాంప్రదాయ కథనానికి భిన్నంగా రాసిన పుస్తకం. ఈ పుస్తకంలో భక్తి మాత్రమే కాదు జీవితాన్ని చూసే ఒక ప్రాక్టికల్ దృక్పథం. గణపతి అంటే జ్ఞానం, ఓర్పుతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియచెప్పే గొప్ప మార్గదర్శినే ఈ “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి” పుస్తక గొప్పతనం అని తెలిపారు.
*ఇంతటి పవిత్రమైన ఈ పుస్తకం ఫస్ట్ లుక్ ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరించారు?
సూర్య తేజ్: ఇలాంటి ఒక గొప్ప పుస్తకాన్ని సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ గారి చేతుల మీదుగా, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ లయన్ కిరణ్ గారు నా జీవితంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నా ఈ కొత్త ప్రయాణం మొదలు కావడం చాలా సంతోషంగా ఉంది.
*సోలో హీరోగా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో 11 మిలియన్ వ్యూ సాధించారు. మరోవైపు వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
సూర్య తేజ్: అప్పుడలా ఇప్పుడిలా సినిమా ప్రైమ్ లో ప్రసారమవుతూనే హిందీలో పర్ఫెక్ట్ బిజినెస్ మాన్ గా 11 మిలియన్ వ్యూస్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ సినిమాతో పాటు నేను “శాఖ న్యోరా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్” కు కో ఫౌండర్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వంతో అనుబంధం కలిగి ఉండి స్కిల్ డెవలప్మెంట్ ఉన్నత విద్యారంగంలో పనిచేస్తున్నాను.
*రచయితగా భవిష్యత్తులో మీ తదుపరి ప్రణాళికలు ఏంటి?
సూర్య తేజ్: కేంద్రమంత్రి నితిన్ గట్కరి గారితో చాలా సన్నిహితంగా ఉంటూ ఆయన ప్రవేశపెట్టిన దార్శనిక విధానాలను ప్రచారం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో రైతులు గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే భారతీయ విధానాలపై మరిన్ని పుస్తకాలను తీసుకురావడమే తన ముందు ఉన్న లక్షమని సూర్యతేజ్ తన భవిష్యత్తు ప్రణాళికను కూడా తెలియజేశారు.