BigTV English
Advertisement

Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Shankar – Murugadoss: ఒకప్పుడు చాలామందిని ఇన్స్పైర్ చేసే దర్శకులుగా పేరు సాధించారు శంకర్ మరియు ఏఆర్ మురగదాస్. వీరు తమిళ దర్శకులు అయినా కూడా తెలుగు ప్రేక్షకులలో కూడా వీళ్లకు మంచి ఆదరణ ఉంది. సమాజానికి ఉపయోగపడే చాలా అంశాలను కమర్షియల్ సినిమా ద్వారా చెప్పడం వీళ్ళ శైలి. శంకర్ విషయానికి వస్తే తను చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో తెలుగులో విడుదలయ్యేది. తాను తీసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ అని చెప్పాలి. ఎక్కువ శాతం ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అన్ని భాషల సినిమాలు కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.


ఈ తరుణంలో శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలు ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించలేకపోతున్నాయి. శంకర్ కెరియర్ లో రోబో లెవెల్ సినిమా వచ్చి చాలా ఏళ్లు గడిచిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజెర్ అనే సినిమా కూడా ఊహించని సక్సెస్ సాధించలేదు. మరోవైపు ఏ ఆర్ మురగదాస్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

2026 ప్లానింగ్ 

ఈ ఇద్దరి దర్శకులు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఉంది. శంకర్ సూర్య హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. సూర్యకి కూడా ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ సినిమా పడి చాలా ఏళ్లు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోతున్నాయి.


మరోవైపు ఏ ఆర్ మురగదాస్ కూడా ఒక కమర్షియల్ సక్సెస్ తో కం బ్యాక్ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా చేసిన మదరాసి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సక్సెస్ సాధించకపోవడం పక్కనపెడితే తను ఇచ్చిన స్టేట్మెంట్స్ వలన ట్రోల్ కి గురి అయ్యాడు. తమిళ్ సినిమాలు ఎడ్యుకేట్ చేస్తాయి అని చెప్పడంతో మురగదాస్ పైన సినిమా రిలీజ్ అయ్యాక విపరీతమైన ట్రోలింగ్ వచ్చాయి. అదే సినిమా సక్సెస్ అయ్యుంటే ఇంకోలా ఉండేది.

తెలుగు సినిమాపై కోపం 

మురగదాస్ చేసిన రమణా సినిమాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఠాగూర్ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా ఏఆర్ మురగదాస్ తమిళ్లో తెరకెక్కించిన ఖైదీ సినిమా రీమేక్.

అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టాలిన్ అనే సినిమా చేశాడు మురగదాస్. ఆ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో అసంతృప్తి పొందాడట. ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంలో ఫీల్ అయినట్లు తెలిసింది. అందుకే చాలా ఏళ్లపాటు తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు. మహేష్ బాబు హీరోగా చేసిన స్పైడర్ సినిమా ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక మొత్తానికి 2026లో ఒక కమర్షియల్ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడేమో ఎదురు చూడాలి.

Also Read: Yellamma: హీరో కన్ఫర్మ్ అయినట్లే, మరి మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వేణు కాంప్రమైజ్ అవుతాడా?

Related News

TFI on Reviewers: తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా?

Akhanda 2 : ప్రతిసారి అదేనా, వీళ్లు ముగ్గురు మారాల్సిందే

Ramgopal Varma : స్పిరిట్ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ రియాక్షన్.. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసంటూ!

The Raja Saab 2: రాజాసాబ్ కు సీక్వెల్ ..కొత్త డైరెక్టర్లకు కాస్త ఛాన్స్ ఇవ్వండయ్యా!

Akhanda 2 : అఖండ 2 రోర్ వీడియో వచ్చేసింది, బాలయ్య బోయపాటి విధ్వంసం

Yellamma: హీరో కన్ఫర్మ్ అయినట్లే, మరి మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వేణు కాంప్రమైజ్ అవుతాడా?

The Raja Saab : ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, బర్త్డే అయిపోయాక ఇంకేముందిలే

Big Stories

×