Sai Pallavi: సాయి పల్లవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటిస్తూనే మరోవైపు పాన్ ఇండియా సినిమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ (Ramayan) సినిమాలో సీత పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. తాజాగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి జయ జయ రామ్(Jai Jai Ram) అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సాంగ్ చూసిన వెంటనే పలువురు చిత్ర బృందం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ పాటలో సాయి పల్లవి(Sai Pallavi) వెనక కొంతమంది హీరోయిన్లను చూపించారు అయితే వారి ఫేస్ క్లారిటీగా కనిపించకుండా బ్లర్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం సీత పాత్రలో ఉన్న సాయి పల్లవిని హైలెట్ చేయడం కోసం వెనుక ఉన్నటువంటి వారిని కనిపించకుండా బ్లర్ చేశారు అంటూ విమర్శిస్తున్నారు. ఇక సాయి పల్లవి వెనుక నటి రియా కపూర్(Riya Kapoor) కనిపిస్తున్నారు. ఈమె భరతుడి భార్య మాండవీ పాత్రలో కనిపించబోతున్నారు.
ఇకపోతే లక్ష్మణుడి భార్య ఊర్మిళ పాత్రలో సోనియా బలానీ నటిస్తున్నారు. ఈమె కూడా ఈ పాటలో సాయి పల్లవి వెనక ఉన్నప్పటికీ ఆమె ఫేస్ కూడా కనిపించకుండా బ్లర్ చేశారు. ఇలా వెనుక ఉన్న నటీమణులను బ్లర్ చేస్తూ సాయి పల్లవిని హైలెట్ చేశారు. దీంతో ఇది చూసిన అభిమానులు సాయి పల్లవి పై చిత్ర బృందం పై విమర్శలు కురిపిస్తున్నారు. నిజానికి సాయి పల్లవి కంటే వెనుక ఉన్నటువంటి సోనియా బలానీ, రియా కపూర్ చూడటానికి అందంగా ఉన్నారు. సీత పాత్ర వారు చేసి ఉంటే బాగుండేదని సీత పాత్రలో నటించిన సాయి పల్లవి చెలికత్తెలాగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
They blurred her out and focused more it on Sai Pallavi in the recent trailer/ song of #Ramayana pic.twitter.com/F65fqhxmG8
— FaithHistoryX (@FaithHistoryX) September 15, 2026
నిజానికి ఈ సినిమా జయ జయ రామ పాటలో మాత్రమే కాకుండా ఈ సినిమా నుంచి గత నెల రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్ లో కూడా ఆమె ఫేస్ చూపించలేదు. ఇలా తరచూ సాయి పల్లవిని హైలెట్ చేయడం కోసం సదరు నటీమణులను బ్లర్ చేయడంతో సాయి పల్లవి కోసం వారిని తొక్కేస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటిస్తున్న విషయం తెలిసిందే. రావణాసురుడిగా హీరో యష్ కనిపించగా సూర్పనక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. మరి దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఎలాంటి విజయాన్ని అందిస్తుందనేది వేచి చూడాలి.
Also Read: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!