Venu Madhav Inspire The Viral ‘Faah’ Sound: సోషల్ మీడియాలో ఇప్పుడు చిన్న చిన్న సౌండ్స్ కూడా పెద్ద ట్రెండ్‌గా మారిపోతున్నాయి. ఒక డైలాగ్, ఒక ఎక్స్ ప్రెషన్ లేదంటే ఎవరో ఒక నటుడు అనుకోకుండా అన్న మాట.. కొన్నిసార్లు సినిమాను దాటి జనాల్లోకి వెళ్లిపోతుంది. అలాంటి వాటిలో ఇప్పుడు ‘ఫాహ్’ అనే ఫన్నీ సౌండ్ కూడా ఒకటి. ఈ చిన్న సౌండ్‌ను నెటిజన్లు తమదైన స్టైల్‌లో ఉపయోగిస్తూ వీడియోలు, మీమ్స్, రీల్స్ చేస్తున్నారు. అయితే అసలు ఈ ‘ఫాహ్’ అనే డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక తెలుగు కమెడియన్ వేణు మాధవ్ ఉన్నారా? సోసల్ మీడియాలో జరుగుతు ఆసక్తికర చర్చ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దర్శకుడు విఘ్నేష్ శివన్ సినిమాకు సంబంధించిన తెలుగు డబ్బింగ్ సమయంలో ఈ డైలాగ్ కు బీజం పడింది. డబ్బింగ్ చెబుతున్న సమయంలో వేణు మాధవ్ డైలాగ్ ను తనదైన కామెడీ టైమింగ్ తో పలికారట. వా.. అన్నా వా.. అన్నారట. ఆ సందర్భంలో ఆయన నోటి నుంచి అనుకోకుండా సౌండ్ ను కాస్త క్రేజీగా ‘ఫాహ్’ మారిందట. సాధారణంగా డబ్బింగ్ సమయంలో ఇలాంటి చిన్నపాటి మార్పులను తిరిగి రికార్డు చేయడం, తొలగించడం జరుగుతుంది. కానీ, ఈ సందర్భంలో మాత్రం ఆ సౌండ్‌ను అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నారట. అదే తర్వాత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందని తమిళ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చెప్తున్నారు.
ఒక నటుడు తన సహజమైన శైలిలో పలికిన చిన్న డైలాగ్ కు ఇంత క్రేజ్ వస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ, సినిమాల్లో వినిపించిన ఈ తరహా ఫన్నీ ఎక్స్ ప్రెషన్‌ను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తర్వాత దాన్ని పలు సందర్భాల్లో కూడా ఉపయోగించబడుతూ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ చిన్న సౌండ్ మరింత వేగంగా వైరల్ అయ్యింది. ‘ఫాహ్’ కూడా అదే విధంగా ఒక సందర్భం నుంచి మరో సందర్భానికి చేరుతూ, చివరకు ప్రత్యేకమైన మీమ్ సౌండ్‌గా మారింది.
సినిమా డైలాగులు భాషలను దాటి ప్రేక్షకుల్లోకి వెళ్లడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా కామెడీకి సంబంధించిన మాటలు, మేనరిజమ్స్ మాత్రం చాలా సులభంగా వైరల్ అవుతుంటాయి. ‘ఫాహ్’ విషయంలోనూ ఇదే జరిగింది. తెలుగు, తమిళ సినిమా కంటెంట్‌తో పాటు రీల్స్, మీమ్స్ లోనూ ఈ సౌండ్‌ను నెటిజన్లు సరదాగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సినిమా డబ్బింగ్ సమయంలో అనుకోకుండా వచ్చిన చిన్న గొంతు చమత్కారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్‌గా మారడం ఆసక్తికరంగా మారింది.
వేణు మాధవ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన కామెడీలో మాటల కంటే టైమింగ్, వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఆకట్టుకునేవి. అందుకే ఆయన పలికిన కొన్ని డైలాగులు ఇప్పటికీ మీమ్స్‌లో, సోషల్ మీడియా పోస్టుల్లో కనిపిస్తుంటాయి. ఆయన నోటి నుంచి పుట్టిన మాటే ఇప్పుడు ‘ఫాహ్’ అంటూ సోషల్ మీడియాను ఊపేయడం నిజంగా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు.
Read Also: అప్పుడు అవమానం.. ఇప్పుడు అభిమానం.. తెలంగాణ యాసను తవ్వి తలకెత్తుకుంటున్న టాలీవుడ్!