E-Paper
Advertisement

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!
Advertisement

Miryalaguda: స్వేచ్ఛ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలో నిమజ్జన కార్యక్రమాలకు పోలీస్‌ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలో సుమారు *1,700 వినాయక విగ్రహాలను* ఏర్పాటు చేశారు. నేడు మూడో రోజు కావడంతో వేములపల్లి, 14 మైల్‌, నాగార్జునసాగర్‌, వాడపల్లి ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జనాలు నిర్వహించుకోవచ్చని మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ రవి తెలిపారు. భక్తులు, ఉత్సవ కమిటీలు పోలీస్‌ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

డీజేలకు అనుమతి లేదు

గణేష్‌ నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని డీఎస్పీ రవి స్పష్టం చేశారు. నిమజ్జన యాత్రల్లో డీజేలు ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవాల పేరుతో నిబంధనలను అతిక్రమించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు.

రూట్‌ ముందే చెప్పాలి

Advertisement

వినాయక ఉత్సవాల నిర్వాహకులు నిమజ్జనానికి విగ్రహాన్ని తరలించే ముందు ఊరేగింపు వెళ్లే మార్గాన్ని పోలీసులకు ముందుగానే తెలియజేయాలని డీఎస్పీ సూచించారు. రూట్‌ మ్యాప్‌ను పోలీసులకు అందించడం ద్వారా నిమజ్జన యాత్రలో ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ఇతర ముందస్తు చర్యలను సులభంగా చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. ఊరేగింపు సమయంలో నిర్ణయించిన మార్గాన్ని మార్చకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. భారీగా భక్తులు తరలివచ్చే ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసలాట, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also read: ఏ మతానికి దయా గుణం ఎక్కువ? బిచ్చగాడి ఐడియా అదుర్స్.. గెలుపు ఎవరిదంటే?

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా..

Advertisement

గణేష్‌ నిమజ్జనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీలపై కూడా ఉందన్నారు. నిమజ్జన యాత్రలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. భక్తులు, యువత అత్యుత్సాహానికి వెళ్లకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా ముగించాలని తెలిపారు.

పోలీసులకు సహకరించాలి..

గణేష్‌ ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యేందుకు పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డీఎస్పీ రవి తెలిపారు. ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, భక్తులు పోలీస్‌ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు సూచించే భద్రతా చర్యలను పాటించాలని చెప్పారు. ప్రమాదరహితంగా.. విషాదరహితంగా గణేష్‌ నిమజ్జన వేడుకలు నిర్వహించడమే పోలీస్‌ శాఖ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ రవి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఉత్సవాలను ప్రశాంతంగా, సంతోషకర వాతావరణంలో పూర్తి చేయవచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ పట్టణ సిఐలు నాగభూషణం, సోమ నరసయ్య ఉన్నారు.

Also read: విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

Tags

Related News

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×