OTT Releases: నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రేక్షకులకు వచ్చే శుక్రవారం సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో థ్రిల్లర్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, కొరియన్ క్రైమ్ డ్రామా, ట్రూ క్రైమ్ ఇలా విభిన్న జానర్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు ఆడియో ఉన్న కంటెంట్ ఎక్కువగా ఉండటంతో తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈ వీకెండ్ మరింత స్పెషల్ కానుంది. ఒకే రోజు సినిమాలు, సిరీస్‌లు కలిపి ఆరు క్రేజీ ప్రాజెక్టులు ఈ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. ఇక సెప్టెంబర్ 17న మరో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ వీకెం డ్ మర్చిపోకుండా చూడాల్సిన నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఒకే రాత్రిలో జరిగే సంఘటనల చుట్టూ తిరిగే ఇంటెన్స్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మోదరాత్రి’. పెళ్లయిన కొత్త జంట ఓ పాత రిసార్ట్‌కు వెళ్లిన తర్వాత వారి గదిలోకి ఓ అపరిచిత వ్యక్తి రావడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు ? దంపతుల గతంలో దాగి ఉన్న రహస్యాలేంటి ? ఆ రాత్రి వాళ్లు ప్రాణాలతో బయటపడతారా ? అన్నది సినిమాలో సస్పెన్స్. సెప్టెంబర్ 18 నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
తెలుగు డివోషనల్ యాక్షన్ డ్రామా ఇరుముడి. థియేటర్లలో ఊచకోత కోసిన రవితేజ సినిమా సెప్టెంబర్ 18న ఒరిజినల్ తెలుగు ఆడియోతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ యాక్షన్ సినిమాలు చూడాలి అనుకునే వారి కోసం ‘బెస్ట్ ఆఫ్ ది బెస్ట్’ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ అండర్‌గ్రౌండ్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కోసం ఐదుగురు ఫైటర్లను ఎంపిక చేస్తారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి జట్టుగా మారి రింగ్‌లో ఎలా పోరాడారనేదే కథ. తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్‌తో సెప్టెంబర్ 18న వస్తోంది.
‘స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2’లో 1985 నాటి హాకిన్స్‌లో జరిగిన మరో మిస్టరీని చూపించనున్నారు. కొత్త టీనేజ్ క్యారెక్టర్లు, వింత జీవుల దాడులు, హాకిన్స్ ల్యాబ్‌కు సంబంధించిన రహస్యాలు కథలో కీలకంగా ఉంటాయి. తెలుగు, తమిళ, హిందీ ఆడియోలతో సెప్టెంబర్ 18న స్ట్రీమింగ్ కానుంది.
రిచ్ ఫ్యామిలీ, హత్య, రాజకీయ కుట్రలు, వివాహేతర సంబంధాలు, కార్పొరేట్ రహస్యాలతో సాగే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ది స్కాండల్’ (The Scandal). ఓ హై-ప్రొఫైల్ కుటుంబంలో జరిగిన హత్య వెనుక దాగిన అసలు నిజాన్ని బయటపెట్టే క్రమంలో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. సెప్టెంబర్ 18న కొరియన్, ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో రానుంది. తెలుగు ఆడియో మాత్రం లేదు.
1892లో అమెరికాలో సంచలనం సృష్టించిన లిజ్జీ బోర్డెన్ హత్య కేసు ఆధారంగా రూపొందిన ట్రూ-క్రైమ్ ఆంథాలజీ సిరీస్ ‘మాన్స్టర్ ది లిజ్జీ బోర్డెన్’ స్టోరీ. తండ్రి, సవతి తల్లి హత్య కేసులో నిందితురాలైన లిజ్జీ నిజంగా నేరం చేసిందా ? లేక పరిస్థితులు ఆమెను నిందితురాలిగా మార్చాయా ? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది. సెప్టెంబర్ 17 నుంచే తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ ఆడియోలతో స్ట్రీమింగ్ కానుంది.
Read Also: ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్