E-Paper
Advertisement

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!
Advertisement

Tollywood: సాధారణంగా టికెట్ ధరల పెంపు సామాన్యుడికి ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటే టికెట్ ధరల కారణంగా ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే నిర్మాతలు మాత్రం సినిమాకి తాము వందల కోట్లు ఖర్చు పెట్టాము.. దానిని రికవరీ చేసుకోవాలంటే టికెట్ ధరలు పెంచాల్సిందే అనే కోణంలో తమ వాదనలను వినిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని చిత్రాలు మాత్రం టికెట్ ధర పెంచకుండానే.. ఇండస్ట్రీ హిట్లు కొడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి..

టిక్కెట్టు ధరలు పెంచకపోయినా కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రాలు..

చిత్ర సీమలో టికెట్ ధరల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలకి కూడా టాలీవుడ్ థియేటర్లలో విపరీతంగా టికెట్ రేట్లు పెంచేస్తుండడం ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేస్తోంది. భారీ రేట్లు పెట్టి రిలీజ్ చేస్తున్న చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోగా సాధారణ టికెట్ ధరలతో థియేటర్లకు వచ్చిన కంటెంట్ ఆధారిత సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తుండడం ట్రేడ్ వర్గాలలో సరికొత్త చర్చకు దారితీసింది.

టికెట్ ధర పెంచితే.. నష్టం ప్రేక్షకుడికా? నిర్మాతకా?

Advertisement

నిజానికి ఈ మధ్యకాలంలో ఇతర భాష చిత్రాలకు కూడా భారీ మొత్తం వెచ్చించి.. థియేటర్ రైట్స్ కొనడం, ఆ తర్వాత ఆ పెట్టుబడి రాబట్టుకోవడానికి టికెట్ ధరలను అమాంతం పెంచేయడం అలవాటుగా మారిపోయింది. గతంలో జైలర్ వంటి వాటి చిత్రాలకు కూడా టికెట్లు రేట్లు పెంచిన దాఖలాలు ఉన్నాయి. అయితే రేట్లు భారీగా పెరిగినప్పుడు సినిమాకు ఏమాత్రం మిశ్రమ స్పందన వచ్చినా.. ప్రేక్షకులు థియేటర్ రావడం మానేస్తారు. ఇంత ఖర్చు పెట్టి ఇతర భాష చిత్రాల హక్కులు కొనడం , వాటిని భర్తీ చేయడానికి సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టడం అవసరమా? అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి..

also read:ఎట్టకేలకు నరేష్ ఏజ్ బయటపెట్టిన రామ్ ప్రసాద్ !

కంటెంట్ ఉంటే లాభాలు గ్యారెంటీ..

Advertisement

ఇకపోతే మరొకవైపు టికెట్ ధరల పెంపు జోలికి వెళ్లకుండానే సాధారణ రేట్లతోనే థియేటర్లలోకి వచ్చిన చిత్రాలు, అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన సమంత మా ఇంటి బంగారం, రవితేజ ఇరుముడి వంటి చిత్రాలే ప్రత్యక్ష ఉదాహరణ.

ఈ చిత్రాలు సాధారణ ధరలతోనే అందుబాటులోకి వచ్చాయి. థియేటర్లలో విడుదల కావడం వల్ల కుటుంబ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కథా బలం తోడవడంతో థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డ్ లతో కళకళలాడాయి. నిర్మాతలకు, పంపిణీ దారులకు ఏకంగా ఐదు రెట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టి ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరిచాయి.

నిర్మాతలు ఆలోచించాల్సిందేనా?

ఇక నిర్మాతలు కాస్త ఆలోచించండి.. భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేసి తాము తీసుకున్న అప్పులను తీర్చడానికి ధరలు పెంచి ప్రేక్షకుడి పై రుద్దడం ఎంతవరకు కరెక్ట్.. సాధారణ టిక్కెట్ ధరలతో రిలీజ్ చేస్తేనే.. దీర్ఘకాలిక థియేటర్ వ్యవస్థ నిలబడుతుందని కూడా ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ రేట్లతో రిస్క్ చేయడం కంటే సరసమైన ధరలతో అందరికీ సినిమాను చేరువ చేయడమే అసలైన సక్సెస్ ఫార్ములా అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి . కనీసం ఇప్పుడు ఈ చిత్రాలను చూసైనా నిర్మాతలు కాస్త ఆలోచించండి. సినిమాలకు భారీ బడ్జెట్ లు కేటాయించి.. నష్టాలు చవిచూడడం కంటే కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి జేబు నింపుకోవడం మంచిది అంటూ పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు . మరి దీనిపై నిర్మాతలు ఆలోచించే సమయం వచ్చిందని చెప్పాలి.

Related News

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

Big Stories

Advertisement
×