Jasprit Bumrah most maiden overs: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా… రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా తలపడ్డాయి. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, 159 పరుగులు చేసి ప్యాకప్ చెప్పింది. అయితే ఇదే మ్యాచ్ లో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah most maiden overs) సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 లలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో బుమ్రా క్రియేట్ చేసిన ఈ వరల్డ్ రికార్డ్, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి ఓవర్ వేసిన యార్కర్ల కింగ్ బుమ్రా.. ఓవర్ మెయిడెన్ చేశాడు. ఈ క్రమంలో టి20 అంతర్జాతీయ క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు బుమ్రా. అంతర్జాతీయ టి20 లలో అత్యధిక సార్లు మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు బుమ్రా మొత్తం 13 ఓవర్లు మెయిడెన్ చేశాడు. బుమ్రా కంటే ముందు జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ నగరవ 12 ఓవర్లతో మొదటి స్థానంలో ఉండేవాడు. అయితే ఆఫ్గనిస్తాన్ పై మెయిడెన్ ఓవర్ వేసిన బుమ్రా.. రిచర్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో తొలి స్థానానికి ఎగబాకాడు బూమ్ బూమ్ బుమ్రా. ఈ ఇద్దరి తర్వాత 10 ఓవర్లు మెయిడెన్ చేసి మూడవ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు.
టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో టి20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరుగుతోంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో గురుబాజ్ మరోసారి డకౌట్ కాగా… మరో ఓపనర్ జెర్డాన్ 35 పరుగులతో రాణించాడు. చివరలో మహమ్మద్ నబి అటు రషీద్ ఖాన్ ఇద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 20 ఓవర్స్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో బుమ్రా, అక్షర్ పటేల్ తో పాటు రవి తలో వికెట్ తీశారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు తీయగా హర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Most Maidens Bowled for India in T20I
(Overs)13 – 𝗕𝘂𝗺𝗿𝗮𝗵 (2, 2, 6, 5, 18, 4, 2, 3, 5, 19, 6, 19, 1)*
10 – Bhuvi (1, 3, 1, 1, 1, 6, 7, 1, 3, 1)
5 – Harbhajan (6, 1, 6, 12, 8)
5 – Hardik (9, 11, 17, 2, 1)
4 – Arshdeep (2, 1, 1, 1)
4 – Jadeja (6, 6, 11, 16)
4 – Axar (1, 4,… pic.twitter.com/i9ocyMGLad— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) September 15, 2026