418Movie Postponed: సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రశాంత్ నీల్ ఒకరు. కే జి ఎఫ్, సలార్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ హర్రర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో 418(418 Movie) అనే హర్రర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని సెప్టెంబర్ 18వ తేదీ విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా ఈ సినిమా విడుదల వాయిదా గురించి వస్తున్నటువంటి వార్తలపై తాజాగా మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడుతున్న విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా నుంచి సెప్టెంబర్ 18వ తేదీ నుంచి వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు అయితే ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని అందుకే మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అయితే కొత్త విడుదల తేది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు.
ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియో మాత్రం అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక పండగ లాంటిదని చెప్పాలి. ఇలా హర్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ శిష్యుడు దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. కీర్తన్ నాడగౌడ(Keerthan Nadagouda) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.
#418TheFilm is postponed and will not be releasing on September 18th.
A new date will be announced soon with a grand multi-language release ❤️🔥
The wait gets a little longer, but #418 is getting grander 🔥 pic.twitter.com/VjY9bNtLXR
— Mythri Movie Makers (@MythriOfficial) September 15, 2026
కీర్తన్ నాడగౌడ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా 18న విడుదల కాబోతోందని భావించి సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేశారు. విడుదలకు అంతా సిద్ధం అనుకునే సమయంలో చిత్ర నిర్మాతలు ఉన్నఫలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని వెల్లడించారు. మరి ప్రశాంత్ నీల్ సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ ఆర్గానిక్ హారర్ థ్రిల్లర్ ‘418 ది మూవీ’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతే తెలిసిందే .ఇలా ఒక వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు ఈయన సమర్పణలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read:ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!