Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది గొప్ప వ్యక్తులకు సంబంధించి బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడు లేదా క్రీడాకారులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల బయోపిక్ సినిమాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భారతీయ సంగీతంలో తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో వందల పాటలను ఆలపిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో లెజెండ్రీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి(M.S.Subba Lakshmi) గారు ఒకరు.
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గాయనిగా ఎంతోమంది ఆదరణను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచారు. ఇలాంటి ఒక గొప్ప సింగర్ జీవిత కథను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) సిద్ధమయ్యారు. రేపు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి 110 జయంతిని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి అధికారగా ప్రకటన తెలియజేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేతలు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని కూడా అధికారికంగా తెలియజేశారు.
రష్మిక మందన్న మొదటిసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో నటించడం గురించి తన ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గెటప్ లో ఉన్నటువంటి తన ఫోటోని ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ…” కొంతమంది లెజెండ్స్ కాలానికి మించి జీవిస్తారు. కొన్ని రాగాలు తరతరాలు దాటి జీవిస్తాయి… అలాగే కొన్ని కథలు సరైన క్షణం చెప్పడానికి వేచి చూస్తూ ఉంటాయి. ఈరోజు ఆ ప్రయాణం మొదలైంది.. ఇది ఎంతటి సంపూర్ణ గౌరవం” అంటూ ఈ బయోపిక్ సినిమాలో నటించడం తనకు ఒక గౌరవంగా భావిస్తున్నట్లు తెలియచేశారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం 5:15 గంటలకు విడుదల కాబోతుందని రష్మిక తెలియజేశారు. ఇలా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక నటిస్తున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు అభినందనలు తెలియ చేస్తున్నారు. ఇక రష్మిక మందన్న నటిస్తున్న మైసా, రణబాలి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16వ తేదీ విడుదల కాగా మైసా సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా వరుస సినిమా పనులలో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!