E-Paper
Advertisement

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!
Advertisement

Allu Arjun -Chandrasekhar Reddy: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది. ఒక భూమి వ్యవహారంలో భాగంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ నానక్ రామ్ గూడలో కలకలం రేపిన ఈ భూవివాదం కారణంగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నానక్ రామ్ గూడలోని ప్రముఖ “మంత్రి కాస్మోస్” భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సెక్యూరిటీని భయభ్రాంతులకు గురిచేసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

చంద్రశేఖర్ రెడ్డి పై కేసు నమోదు..

ఈ నేపథ్యంలోనే మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నేడు ఉదయం 8: 30 సమయంలో మురళీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గడ్డం రవి నేతృత్వంలో కొంతమంది వ్యక్తులు బిల్డింగ్ కార్నర్ గేటు తాళాలను పగలగొట్టి అక్రమంగా లోపలికి చొరబడినట్ల తెలిపారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన సెక్యూరిటీపై దాడి చేస్తూ అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐటీ సంస్థల కార్యకలాపాలకు ఆటంకం…

Advertisement

మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన ఘటనలు అక్కడ సీసీటీవీ కెమెరాలలో నమోదు అయినట్లు తెలిపారు. ఈ విధంగా ఈ కాస్మోస్ బిల్డింగ్ ఆక్రమించుకుంటే ఎన్నో ఐటీ సంస్థల కార్యకలాపాలకు, అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలను ఆధారాలతో సహా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులకు అందజేశారు.

కఠినమైన చర్యలు తీసుకోవాలి…

ఇలాంటి ఆక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడిన చంద్రశేఖర్ రెడ్డి అలాగే మురళీధర్ రెడ్డి రవి సహా బాద్యులైన వారందరి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ అసోసియేషన్ పోలీసులను కోరారు. ఇక ఉద్యోగులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తో పాటు తెలంగాణ డీజీపీ ,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ,మాదాపూర్ డీజీపీ గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు తెలియజేశారు. ఇలా ఈ భూ వ్యవహారంలో భాగంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా నమోదు కావడంతో ఈ విషయం కాస్త ఇటు చిత్ర పరిశ్రమలో కూడా చర్చలకు కారణమైంది. మరి ఈ విషయంపై నటుడు అల్లు అర్జున్ స్పందిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

Related News

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

Big Stories

Advertisement
×