E-Paper
Advertisement

షుగర్ పేషెంట్లకు దీపావళి డైట్ ప్లాన్.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

షుగర్ పేషెంట్లకు దీపావళి డైట్ ప్లాన్.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?
Advertisement

Diwali Diet Tips for Diabetic Patients| దీపావళి వచ్చిందంటే చాలు.. ఇంటి నిండా స్వీట్లు, ఘుమఘుమలాడే పిండివంటలు, రకరకాల చిరుతిళ్లు దర్శనమిస్తాయి. బంధువులు, స్నేహితులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే డయాబెటిస్ (మధుమేహం, షుగర్ వ్యాధి) ఉన్నవారికి మాత్రం స్వీట్లు కనిపిస్తే తినాలా? ఈ ఒక్క పూటకు నలుగురి సంతోషం కోసం తినేద్దామనిస్తుంది. కానీ తింటే షుగర్ పెరుగుతుందేమోనని ఆందోళన కూడా చెందుతుంటారు. అయితే కొన్ని ఆహార నియమాలు పాటిస్తే పండుగకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి షుగర్ పేషెంట్లు దీపావళి వేళ ఏం తినాలి? వేటికి దూరంగా ఉండాలి? నిపుణులు సూచించే ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుందాం.

1. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి

షుగర్ ఉన్నవారు దీపావళి భోజనంలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మొలకలు, సలాడ్లు తీసుకోవాలి. ఇవి పోషకాలను అందించడంతో పాటు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కూడా తినవచ్చు. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి. తృణధాన్యాలతో చేసిన ఆహారాలు కూడా మంచి ఎంపిక.

2. స్వీట్లు తినాలనిపిస్తే ఇలా చేయండి

Advertisement

దీపావళి సమయంలో స్వీట్లు తినాలనిపించడం సహజం. అయితే షుగర్ పేషెంట్లు ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు. బాదం, కొబ్బరితో తయారుచేసిన తక్కువ చక్కెర కలిగిన స్వీట్లను చిన్న పరిమాణంలో తీసుకోవచ్చు. బెల్లం, తేనె కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయని గుర్తుంచుకోవాలి. ఇవి చక్కెరకు పూర్తిగా సురక్షితమైన ప్రత్యామ్నాయాలు కావు.

3. నూనెలో వేయించిన స్నాక్స్ వద్దు

సమోసాలు, పకోడీలు, మిక్చర్ వంటి నూనెలో వేయించిన స్నాక్స్ ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా వేయించిన శనగలు, మఖానా, మొలకలతో చేసిన చాట్, పెసరపప్పు చిల్లా వంటివి తీసుకోవచ్చు. ఇవి మంచి చిరుతిళ్లుగా ఉపయోగపడతాయి.

Advertisement

Also Read: ప్రేమలో అందం, ఆకర్షణలు కాదు.. బంధం బలపడాలంటే ఇది ముఖ్యం

4. ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి

జిలేబీలు, గులాబ్ జామూన్ వంటి ఎక్కువ చక్కెర ఉండే స్వీట్లు తగ్గించాలి. కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. సమోసాలు, పకోడీలు, మైదాతో చేసిన పదార్థాలను కూడా పరిమితం చేయాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడం కష్టమవుతుంది.

Also Read: మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటోందా? ముందు కిచెన్‌లో ఈ 5 ఫుడ్స్ తీసి పడేయండి

5. మందులు, వ్యాయామం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు

పండుగ హడావుడిలో భోజనం చేసే సమయాలను మార్చకూడదు. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. తగినంత నీరు తాగుతూ, వైద్యుల సూచనల మేరకు షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవాలి. ప్రతిరోజూ కొద్దిసేపు నడవాలి. డాక్టర్ సూచించిన మందులు, ఇన్సులిన్‌లను నిర్ణీత సమయానికి తీసుకోవాలి. పండుగ పేరుతో మందులను ఆపకూడదు లేదా మోతాదు మార్చకూడదు.

దీపావళిని ఆనందంగా జరుపుకోవడానికి షుగర్ పేషెంట్లు తమకు ఇష్టమైన ఆహారాలన్నింటినీ పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. సరైన ఆహార ఎంపికలు, తగిన పరిమాణాలు, క్రమబద్ధమైన జీవనశైలితో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పండుగ ఆస్వాదించవచ్చు.

Related News

దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే అదృష్టం పట్టినట్లే.. ఈ సంకేతాలు శుభసూచకం

కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు మంచి అవకాశం వచ్చినా సంకోచిస్తారు

ఇంటికి చుట్టాలొస్తే మష్రూమ్ గలౌటీ కబాబ్ చేసి పెట్టండి.. టేస్ట్ అదిరిపోయిందని మెచ్చుకుంటారు!

బ్రెడ్‌తో ఇంత రుచికరమైన స్వీటా? పండగల స్పెషల్ ‘షాహీ టుక్డా’ను మీరు ట్రై చేసేయండి!

చికెన్ కంటే పవర్‌ఫుల్.. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే 5 సూపర్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

నోరూరించే పచ్చి రొయ్యల బెండకాయ పులుసు..క్షణాల్లో రెడీ అవుతుంది!

నోరూరించే వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి అదుర్స్!

Big Stories

Advertisement
×