E-Paper
Advertisement

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు
Advertisement

KTR: స్వేచ్ఛ బ్యూరో: ఒకవైపు తెలంగాణలో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటే, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై శనివారం తీవ్ర విమర్శలు చేశారు. కోడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తలకిందులుగా పడినా గెలుపు తమదే అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉందని వ్యాఖ్యానించారు. కోడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, మంత్రి పొంగులేటికి చెందిన సొంత కంపెనీ కూడా టెండర్లలో పాల్గొన్నదని ఆరోపించారు. మిగతా కంపెనీలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్న నామమాత్రపు సంస్థలని, చివరకు ఒక్క కంపెనీ మాత్రమే పోటీలో మిగిలి విజయం సాధించేలా వ్యవహారం నడిచిందని విమర్శించారు.

ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా?

Advertisement

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అంటే దాదాపు 5 రెట్లు వ్యయం పెరిగిందని, ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ.. టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. టెండర్లలో పారదర్శకతకు తావు లేకుండా, తమకు అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి, ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ దోపిడీని వివరించడానికి సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు.ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, టెండర్ల ప్రక్రియలోనూ తమకు అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు.

Also Read: ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

Tags

Related News

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

తెలంగాణ వైద్యరంగంలో బిగ్ అప్‌డేట్.. ఒకేసారి 359 పీజీ సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్!

రాహుల్‌ గాంధీకి నల్ల జెండాల నిరసన తప్పదు: రాంచందర్ రావు

మాదాపూర్‌కు సరికొత్త ల్యాండ్‌మార్క్.. లగ్జరీ లుక్‌లో తమ్మిడికుంట చెరువు!

భార్య చిన్న కోరిక.. తట్టుకోలేక గొంతు నులిమి చంపిన భర్త, నిందితుడు కానిస్టేబుల్

గంటలో రూ.7.09 కోట్లు మాయం.. హైదరాబాద్ NBFC ఖాతాపై సైబర్ క్రిమినల్స్ పంజా!

Big Stories

Advertisement
×