BigTV English

Dil Raju: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. ఇకపై

Dil Raju: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. ఇకపై

Dil Raju: ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ (Betting App)ప్రమోషన్ పెద్ద ఎత్తున సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో పాల్గొనడంతో వారిపై కేసులు నమోదు అవ్వడమే కాకుండా ఏకంగా ఈడీ విచారణలకు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే. విచారణకు హాజరైన సెలబ్రిటీలు ఇక పై తాము ఇలాంటి ప్రమోషన్లకు పాల్పడం అంటూ తెలియజేశారు అయితే తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల విషయంపై తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు.


పైరసీ ముఠా వెనుక బెట్టింగ్ యాప్ నిర్వహకులు..

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లను చేయరని ఈయన తెలియజేశారు.సినిమా పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ హబ్ గా చేయాలని భావిస్తున్నారు. అది సాధ్యం కావాలి అంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా దిల్ రాజు పైరసీ (Piracy)గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వేలకోట్ల రూపాయల నష్టం..

ఇటీవల కాలంలో కొంతమంది సినిమా పైరసీలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమా విడుదలైన మొదటి రోజు కొన్ని వెబ్ సైట్ లలో సినిమాలు హెచ్డీ ప్రింట్ బయటకు వస్తున్న నేపథ్యంలో పైరసీకి అడ్డుకట్టు వేయడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అయితే నేడు తెలంగాణ సైబర్ క్రైమ్ పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దిల్ రాజు ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా పలువురు పైరసీకి పాల్పడటం వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి 18 % రెవెన్యూ దెబ్బతినింది అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా సినిమాలను పైరసీ చేయడం ద్వారా రూ.22,400 కోట్ల రూపాయల నష్టం మన ఇండియా సినిమా ఇండస్ట్రీకి జరిగిందని,ఈ సినిమా పైరసీ వెనుక బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వాహకులు ఉన్నారనే విషయాన్ని పోలీసులు తెలియజేశారు.


బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు దూరంగా టాలీవుడ్..

ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ ఘటన పట్ల స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా ఇకపై బెట్టింగ్ ప్రమోషన్స్ నిర్వహించరని తెలియజేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది హీరోల సినిమాలు ఇలా పైరసీకి గురైన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా కూడా పైరసీ బారిన పడింది. గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పైరసీకి అడ్డుకట్టు వేయడం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్న పైరసీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇక దిల్ రాజు విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Rishabh Shetty: బాయ్ కాట్ కాంతార.. రిషబ్ తీరు పై నెటిజన్స్ ఫైర్!

Related News

Prabhas Raja Saab: డీజే ల్లో వినిపించే ఆ పాటనే రాజా సాబ్ లో ఇరికించారు, ఇదే హింట్

Pawan Kalyan OG : కొద్దిసేపట్లో ఓజి సినిమా చూడనున్న మెగా ఫ్యామిలీ, ప్రత్యేకించి అక్కడ చూడటానికి కారణం ఇదే

Sobhita: సమంతపై పొగడ్తల వర్షం.. శోభితా దూళిపాళ్ళ ఇంత గొప్పగా ఆలోచిస్తుందా?

Rishabh Shetty: బాయ్ కాట్ కాంతార.. రిషబ్ తీరు పై నెటిజన్స్ ఫైర్!

Animal Park Update : సందీప్ రెడ్డి యానిమల్ పార్క్‌పై హీరో సాలిడ్ అప్డేట్… రిలీజ్ డేట్ కూడా.!

Chiranjeevi: మాట్లాడడానికి ఏం లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్‌

OG Movie Tickets : టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ… పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా సామి

Big Stories

×