రెనాల్ట్ ట్రైబర్ 2025 దేశంలో అత్యంత సరసమైన 7-సీటర్ కార్లలో ఒకటిగా మారబోతోంది. ముఖ్యంగా GST 2.0 ప్రవేశపెట్టిన తర్వాత ఈ కారు ధర మరింత తగ్గింది. అంతేకాదు, రెనాల్ట్ కొత్త ట్రైబర్ ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో అందుబాటులోకి రాబోతోంది. అదే సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ అనుకూలంగా ఉంటుంది. తక్కువ EMI ఆప్షన్ ను కూడా అందిస్తోంది.
2025 ట్రైబర్ విస్తృత క్రోమ్ గ్రిల్, షార్ప్ LED హెడ్ ల్యాంప్ లు, స్పోర్టీ బంపర్లు, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ తో కూడిన అప్‌గ్రేడ్ బోల్డ్ లుక్ తో వస్తుంది. దీని కాంపాక్ట్ కొలతలు సులభంగా హ్యాండిల్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. SUV-ప్రేరేపిత డిజైన్ దీనికి ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ ను ఇస్తుంది.
క్యాబిన్ లోపల, రెనాల్ట్ ట్రైబర్ 2025 విశాలమైన 7-సీటర్ మాడ్యులర్ లేఅవుట్‌ను అందిస్తుంది. థర్డ్ రోను మడతపెట్టే అవకాశం ఉంటుంది. అవసరం లేదనుకుంటే వాటిని తీసివేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ లగేజీ స్థలం పొందే అవకాశం ఉంటుంది. ఇది కుటుంబ ప్రయాణాలకు, నగర వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రీమియం ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, వెనుక AC వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ సౌకర్యం మరింత సౌలభ్యంగా ఉండేలా చేస్తుంది.
ఈ కారు వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు మద్దతు ఇచ్చే 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. అన్ని వరుసలకు USB ఛార్జింగ్ పోర్ట్ లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి.
రెనాల్ట్ ట్రైబర్ 2025 అనేది అధిక ఇంధన సామర్థ్యం, సున్నితమైన పనితీరు కోసం ట్యూన్ చేయబడిన 1.0L పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ కారు 22 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన 7-సీట్ల MPVలలో ఒకటిగా నిలువనుంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ ఉన్నాయి. ఇందులో మల్టీఫుల్ ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను అమర్చింది. ఇది ప్రయాణీకులకు పూర్తి భద్రతను అందిస్తుంది.
రెనాల్ట్ ట్రైబర్ 2025 వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర (సుమారుగా) బేస్ మోడల్ రూ. 5.49 లక్షలు, మిడ్ వేరియంట్ రూ. 6.75 లక్షలు, టాప్ మోడల్ రూ. 8.25 లక్షలు ఉంటుంది. ఈ కారు ఆకర్షణీయమైన లోన్ ప్లాన్‌లను అందిస్తోంది. కొనుగోలుదారులు కేవలం రూ.1.50 లక్షల డౌన్ పేమెంట్‌తో కారును పొందవచ్చు. మిగిలిన బ్యాలెన్స్ ను సులభమైన EMIల ద్వారా ఫైనాన్స్ చేసుకోవచ్చు. EMI నెలకు రూ. 8,999 నుండి ప్రారంభమవుతుంది. 5–7 సంవత్సరాలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.
Read Also: 400 కిమీ రేంజ్, 110 కిమీ స్పీడ్.. వచ్చేస్తోంది సరికొత్త ఎలక్ట్రిక్ స్ప్లెండర్!