Jio Vs Airtel: ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ఎంచుకోవడంలో చాలా మంది యూజర్లు ఒక ఆలోచనలో ఉంటారు. ఏది సరైనది, ఏ ప్లాన్ ఎక్కువ డేటా, ఫ్రీ కాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలతో వస్తుంది? ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి వారి కోసం, ఈ రెండు ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ తక్కువ ఖర్చులో ఎక్కువ సదుపాయాలు ఇచ్చే బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్‌లను పరిచయం చేస్తున్నాయి. వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
జియో రీచార్జ్ జస్ట్ రూ. 239 బెనిఫిట్స్
ముందుగా జియో రీచార్జ్ ప్లాన్ గురించి చెప్పాలి. 239 రూపాయల ప్లాన్ 22 రోజుల వాలిడిటీ కలిగి ఉంది. ప్రతిరోజూ 1.5జిబి డేటా అందుతుంది. అంటే సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం సులభంగా ఉపయోగించవచ్చు. అదనంగా, 100 ఎస్ఎంఎస్‌లు కూడా ప్రతిరోజూ లభిస్తాయి. ఎమర్జెన్సీ సందేశాలకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ ప్లాన్‌లో అనలిమిటెడ్ కాల్స్ సౌకర్యం కూడా ఉంది. అంటే, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా ఫ్రీ కాల్స్ చేయవచ్చు. అంతే కాకుండా, జియోటివి, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఫ్రీగా ఉంటాయి. డేటా, కాల్స్ మాత్రమే కాకుండా, వీడియో, ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ స్టోరేజ్ కూడా ఒకే ప్లాన్‌లో పొందవచ్చు.
ఎయిర్‌టెల్ కేవలం రూ.219 బెనిఫిట్స్
ఇప్పుడు ఎయిర్‌టెల్ రీచార్జ్ ప్లాన్ చూస్తే, 219 రూపాయల ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కలిగి ఉంటుంది. మొత్తం 3జిబి డేటా అందుతుంది. దీన్ని రోజుకు ప్రత్యేకంగా కాకుండా మొత్తం వాలిడిటీలో వినియోగించవచ్చు. ఇందులో కూడా అనలిమిటెడ్ కాల్స్ ఉంటాయి, కాబట్టి అన్ని నెట్‌వర్క్‌ల యూజర్లతో మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు.
Also Read: Flight Tickets Offers 2025: విమాన ప్రయాణం కేవలం రూ.1200లకే.. ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు
ఎయిర్‌టెల్ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది స్పామ్ కాల్స్ నుండి రక్షణ ఇస్తుంది. ర్యాండ్‌మ్ లేదా అనవసర కాల్స్ నుండి రక్షణ ఉండటం వినియోగదారుల కోసం చాలా ఉపయోగకరం. అదనంగా, హలో ట్యూన్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు ఇష్టమైన ట్యూన్ వినవచ్చు.
ఈ రెండు ప్లాన్స్ ఎలా ఎంచుకోవాలి?
ఈ రెండు ప్లాన్స్‌లను ఎంచుకోవడం చాలా సులభం. మీరు కంపెనీ ఆఫీషియల్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి డిజిటల్ వాలెట్ లేదా యూపిఐ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా సులభంగా రీచార్జ్ చేయవచ్చు.
వీటి రెండింటిని పోలిస్తే, జియో ప్లాన్ 239 రూపాయలతో 22 రోజుల వాలిడిటీ, రోజుకు 1.5జిబి డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అనలిమిటెడ్ కాల్స్, జియో టివి & జియోక్లౌడ్ ఫ్రీ. అందువల్ల ఖచ్చితంగా చెప్పాలంటే జియో బెటర్. కానీ 10రూపాయలు ఎక్కువ ఎందుకు చిన్న బెనిఫిట్స్ అయినా ఎయిర్‌టెల్ ప్లాన్ 219 రూపాయల ప్లాన్ బెస్ట్ అనుకుంటే దీనికి కూడా సై అనే చెప్పొచ్చు.
ఎందుకంటే జియో కన్నా ఇది 28 రోజుల వాలిడిటీ, మొత్తం 3జిబి డేటా, అనలిమిటెడ్ కాల్స్, హలో ట్యూన్ ఫ్రీ, స్పామ్ కాల్ ప్రొటెక్షన్. ఇలాంటి తక్కువ ఖర్చులో ఎక్కువ సదుపాయాలు ఇచ్చే ప్లాన్స్ చాలా అరుదు. కాబట్టి, మీ అవసరాన్ని బట్టి ప్లాన్ ఎంచుకుని రీచార్జ్ చేయడం మంచిది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వర్క్ కోసం కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనం పొందడానికి, ఈ అవకాశాన్ని తప్పక వినియోగించండి. డేటా, కాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఒకే ప్లాన్‌లో పొందగలిగితే, మీ రోజువారీ కమ్యూనికేషన్ సులభం అవుతుంది.