AIIMS Mangalagiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది శుభవార్త. ఎయిమ్స్, మంగళగిరిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎంహెచ్ పాసైన వారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.1,68,900 వరకు జీతం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Mangalagiri) రెగ్యులర్ విధానంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 121
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు వెకెన్సీలు..
1. ప్రొఫెసర్: 10 పోస్టులు
2. అడిషనల్ ప్రొఫెసర్: 08 పోస్టులు
3.అసోసియేట్ ప్రొఫెసర్: 20 పోస్టులు
4.అసిస్టెంట్ ప్రొఫెసర్: 83 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎంహెచ్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 26
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 58 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థలకు 3 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థలకు 10 ఏళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,01,500 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థలకు రూ.2,100. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aiimsmangalagiri.edu.in/vacancies/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 121
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 26
ALSO READ: BEL Notification: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.40వేలు, ఇంకెందుకు ఆలస్యం