E-Paper
Advertisement

Rashmi Gautam: వాళ్లను ఇరాన్‌ పంపేయమంటే.. పెళ్లి, పిల్లలు అంటూ రష్మీపై ట్రోల్స్‌!

Rashmi Gautam: వాళ్లను ఇరాన్‌ పంపేయమంటే.. పెళ్లి, పిల్లలు అంటూ రష్మీపై ట్రోల్స్‌!
Advertisement

Rashmi Gautam: ఖమేనీ మృతికి సంతాపంగా జమ్మూకశ్మీర్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు, లక్నో వంటి ప్రధాన నగరాల్లో షియా ముస్లింలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఆందోళనలపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారతదేశం (India)లో ఉంటూ ఇరాన్ (Iran) నేత కోసం వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడంపై రష్మి విస్మయం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఒక్కరు కూడా బయటకు రాలేదు, ఇప్పుడు అక్కడెక్కడో ఉన్న అతనికి ఏదో అయిందంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తారా? అంటూ రష్మీ కాస్త ఘాటుగానే రియాక్టైంది. ఇంకా ఆమె ఏమందంటే..

Also Read- MSG Movie: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 50 కొట్టేశారు.. ఎన్ని సెంటర్లలో అంటే?

ఇరాన్ పంపించేయండి

Advertisement

‘‘భారతదేశంలో నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మీకు ఇరాన్ పట్ల అంతగా ప్రేమ ఉంటే.. ప్రధాని మోదీ గారికి నాదొక చిన్న విన్నపం. వీరందరినీ ఇరాన్ పంపించేయండి. వారు నేరుగా అక్కడికి వెళ్లి ఆ దేశం తరఫున యుద్ధం చేస్తారు” అంటూ రష్మి ఫైరయింది. విదేశీ వ్యవహారాల కోసం మన దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీనికి ఆమెపై కొందరు కావాలని ట్రోలింగ్ మొదలెట్టారు. ‘‘నువ్వు పెళ్లి చేసుకుని, సుఖంగా ఉండటం మంచిది. ఒంటరిగా ఉండటం వల్లే నీకు ఇతర మతాల మీద ఇంత ద్వేషం పుడుతున్నట్లు కనిపిస్తోంది’’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేస్తే.. అతనికి గట్టిగా ఇచ్చిపడేసింది.

Also Read- Santosh Sobhan: లేడీ డైరెక్టర్.. ఇలాంటి ప్రశ్నలే మానుకుంటే మంచిది.. మీడియాకు క్లాస్!

మీరు కండోమ్స్ ప్రచారం మొదలెట్టాలి

Advertisement

‘‘తొమ్మిదేళ్లకే బాలికలకు పెళ్లిళ్లు చేసే ఛాందసభావాలున్న దేశంలో నేను నివసించడం లేదు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండగలను, పిల్లలు లేకుండా కూడా ఉండగలను. అయినా సరే, నా దేశంలో నాకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉంది. అవి చాలు నేను జీవించగలను’’ అని కౌంటర్ ఇచ్చింది. దీనికి సదరు వ్యక్తి.. ‘‘అవును, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, పిల్లలు లేకుండా ఉండొచ్చు. కానీ ముస్లింలపై ద్వేషాన్ని చిమ్మడం మానేసి.. నీ జీవితంలో సంతోషాన్ని నింపే తోడుని వెతుక్కోవడం లేదంటే నీకున్న అసంతృప్తిని పరిష్కరించుకోవడం ముఖ్యం. బంగ్లాదేశ్‌లో హిందువుల కోసం హిందువులు నిరసన తెలపగలిగినప్పుడు, కాశ్మీర్ విషయంలో ముస్లింలు కూడా అలాగే స్పందిస్తారు’’ అని సమాధానమిచ్చాడు. ‘‘మా దేశంలో జనాభా హద్దులు దాటిపోతున్న తీరు చూస్తుంటే.. మీరు ప్రజలకు గర్భనిరోధక సాధనాలు వాడమని లేదా ఆపరేషన్ చేయించుకోమని ప్రచారం చేయడం మొదలుపెట్టాలేమో. అప్పుడైనా ఒక క్రికెట్ టీమ్ అంత మంది పిల్లల్ని కనడం ఆపుతారు. మిగిలిన మా లాంటి వాళ్లమంతా ఒక పద్ధతి ప్రకారం ఉన్నాం. మేము కష్టపడతాము, సక్రమంగా పన్నులు కడతాము. ఇక నా జీవితంలో నాకు తోడు ఉందా లేదా అన్నది నాకు మాత్రమే తెలిసిన విషయం.. ఆ విషయంలో మీరు కేవలం ఊహించుకుంటూ ఉండొచ్చు’’ అంటూ అస్సలు తగ్గేదేలే అనేలా రష్మీ గౌతమ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.

Also read- Allari Naresh: అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ అప్డేట్ ఇదే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×