BigTV English
Advertisement

Bigg Boss 9 : రైస్ కి ఆ మాత్రం గోల పెట్టేసింది, ఈయనకి పప్పులో టమోటాలు కావాలట

Bigg Boss 9 : రైస్ కి ఆ మాత్రం గోల పెట్టేసింది, ఈయనకి పప్పులో టమోటాలు కావాలట

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఊహించిన ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఆల్మోస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు అనుకున్న వాళ్లు ఇప్పటివరకు మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఈ సీజన్ మాత్రం కొంత మేరకు ప్రత్యేక అని చెప్పాలి. మొదట అనౌన్స్ చేసినట్టుగానే ఇది చదరంగం కాదు రణరంగం అన్నట్లుగానే ఉంది.


వాస్తవానికి ఈ సీజన్ మీద చాలా నెగిటివ్ ట్రోలింగ్ వస్తుంది. ఈ విషయం బిగ్ బాస్ యాజమాన్యం కు కూడా తెలుసు. సోషల్ మీడియా బాగా పాపులర్ కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ బట్టే వీకెండ్ ఎపిసోడ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా కంటెంట్ బట్టే నాగార్జున కూడా మాట్లాడుతున్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాగార్జున ప్రస్తావించిన చాలా అంశాలు కూడా సోషల్ మీడియా నుంచి తీసుకున్నవే.

రైస్ కు గోల పెట్టేసింది 

బిగ్ బాస్ హౌస్ లో సంజన ఒక కంటెస్టెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువసార్లు సంజన నామినేషన్ లో ఉన్నారు. అయితే సంజన అప్పట్లో విపరీతమైన కంటెంట్ కూడా ఇచ్చారు. కొన్ని టాస్కులు విషయంలో సరిగ్గా ఆడలేరు. కానీ మిగతా విషయాల్లో కొంచెం యాక్టివ్ గానే ఉంటారు సంజన.


ప్రస్తుతం కిచెన్ మానిటర్ గా తనుజ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తనుజాకి చెప్పకుండా సంజన అన్నం పెట్టుకుంది అని విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసింది. ఇదే విషయంపై సంజనా కూడా తింటున్న అన్నాన్ని వదిలేసి మరి వెళ్ళిపోయి చాలా బాధపడింది. కిచెన్ మానిటర్ గా ఆమెను ఎందుకు పెట్టారు ఆవిడకి మినిమం కామన్ సెన్స్ లేదు అంటూ సంజన తనుజ పై మాట్లాడింది.

టమాటలు కావాలట 

అయితే ఒక వైపు కిచెన్ లో బీభత్సమైన గొడవ జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంజన తనూజ మధ్య ఆర్గ్యుమెంట్ మర్చిపోకముందే సాయి శ్రీనివాస్ రిక్వైర్మెంట్స్ హైలెట్ గా మారాయి. ప్లేట్ పట్టుకొని వచ్చి పప్పు వేయమని అడిగాడు. సరిపోదు అని మాధురి కూడా చెప్పారు. పప్పు వేయమనడం కాకుండా ఎక్స్ట్రాగా టమాటాలు కూడా కావాలనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాయి శ్రీనివాస్ విషయానికొస్తే గోల్కొండ హై స్కూల్, ఊపిరి వంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. శుభలేఖలు వంటి సినిమాతో సోలో హీరోగా కూడా ప్రయత్నాలు చేశాడు. శుభలేఖలు, వినరా సోదర వీర కుమార సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక బిగ్ బాస్ తర్వాత అవకాశాలు ఏమైనా వస్తాయేమో చూడాలి.

Also Read: Bigg Boss 9 : తనుజా కు ఎదురు తిరిగిన మాధురి, భరణి వచ్చాక వదిలేసింది అంటూ

Related News

Bigg Boss 9 Day 52: హౌజ్ లో ఉల్లి లొల్లి.. తనూజకి దడుస్తున్న దివ్య, ఎంట్రీ ఇచ్చేసిన భరణి…

Bigg Boss 9 : తనుజా కు ఎదురు తిరిగిన మాధురి, భరణి వచ్చాక వదిలేసింది అంటూ

Salman Khan: సల్మాన్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ రూ.200 కోట్లు…క్లారిటీ ఇచ్చిన నిర్మాత..అర్హుడంటూ!

Bigg Boss 9 Promo: టాస్క్ లో విపరీతమైన తొపులాట.. స్విమ్మింగ్ పూల్ లో పడ్డ భరణి, ఆస్పత్రికి తరలింపు

Bigg Boss 9: భరణి – శ్రీజ ఇద్దరు హౌస్‌లోనే.. చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss 9 Promo: రీఎంట్రీ ఫైర్.. చిరాకు దొబ్బుతున్నారు భయ్యా!

Bigg Boss 9: దివ్య మళ్లీ బంధాన్ని కొనసాగించాలి అని చూస్తుందా? గౌరవ్ గుప్తాతో ఆర్గ్యుమెంట్ అవసరమా?

Big Stories

×