MassJathara vs Bahubali The Epic: ఒకప్పుడు ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమాకు ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఇతర సినిమాలు విడుదల అవుతున్న వాయిదా పడేవి. కానీ ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే పోటీ ఏర్పడింది. ఒకే రోజు పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాయి. ఇకపోతే అక్టోబర్ 31వ తేదీ కూడా స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వార్ లో గెలుపు ఎవరిదనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ప్రభాస్(Prabhas) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి. ఈ సినిమా 10 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రీ రిలీజ్ సినిమాలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట విడుదల చేస్తున్నారు .ఈ సినిమాని అక్టోబర్ 31వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్నప్పటికీ ఊహించని విధంగా ఆదరణ లభిస్తుంది.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కావడంతో మంచి ఆదరణ లభించింది. అలాగే ప్రీ రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుపుకుంది. ఇకపోతే అక్టోబర్ 31వ తేదీ భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ(Raviteja) శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా కూడా విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రీమియర్లు ప్రసారమయ్యి 31వ తేదీ సినిమా విడుదల కావాల్సి ఉండగా, అదే రోజు బాహుబలి ది ఎపిక్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని అక్టోబర్ 31వ తేదీ ప్రీమియర్లను ప్రసారం చేస్తూ ఒకటవ తేదీ విడుదల చేయబోతున్నారు.
మాస్ హీరో హిట్ కొట్టేనా?
ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇలా ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే ఈ రెండు సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. బాహుబలి అప్పుడే మనం చూసిన సినిమాలే కాబట్టి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందా? లేదంటే రవితేజ మాస్ జాతర మంచి ఆదరణ పొందుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రవితేజ శ్రీ లీల కాంబినేషన్లో ఇదివరకే ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రవితేజ పలు సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. మరి మాస్ జాతర ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Salman Khan: సల్మాన్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ రూ.200 కోట్లు…క్లారిటీ ఇచ్చిన నిర్మాత..అర్హుడంటూ!