BigTV English
Advertisement

Bigg Boss 9 Day 52: హౌజ్ లో ఉల్లి లొల్లి.. తనూజకి దడుస్తున్న దివ్య, ఎంట్రీ ఇచ్చేసిన భరణి…

Bigg Boss 9 Day 52: హౌజ్ లో ఉల్లి లొల్లి.. తనూజకి దడుస్తున్న దివ్య, ఎంట్రీ ఇచ్చేసిన భరణి…


Bigg Boss 9 Day 52 Episode Review: భరణికి గాయం అవ్వడంతో రీఎంట్రీ టాస్క్ నిలిచిపోయింది. ఈ వారం హౌజ్ లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. నామినేషన్ వారి చేతిలో పెట్టాడు. అలాగే ఇద్దరిని పిలిచి టాస్క్ పెట్టి వారిలో ఒక్కరికి మాత్రమే పర్మినెంట్ హౌజ్ మేట్ ఛాన్స్ ఇచ్చాడు. భరణి, శ్రీజలకు రీఎంట్రీ అవకాశం ఇచ్చాడు. రెండు లెవల్లో టాస్క్ ఇచ్చారు. నిన్న ఒక లెవెల్ టాస్క్ అయిపోయింది. ఈ రోజు రెండో లెవెల్ బిగ్ బాస్ ఇచ్చిన వివిధ టాస్క్ లో గెలిచి అక్కడ ఉన్నప్యాలెస్ పై తమ జెండాలను నిలపాలి. అలా చివరికి ఎవరివి ఎక్కువ ఉంటే వాళ్లే విన్. మొదటి లెవెల్లో ‘కట్టు.. పడగొట్టు‘ పేరుతో స్కేర్ బాక్స్ లో ఏడు అంతస్తుల టవర్ కట్టాలి. అపోజిట్ టీం ఆ టవర్ పడగొట్టాలి. ఇందుకోసం హౌజ్ పర్మినెంట్ అవ్వాలకునే కంటెస్టెంట్స్ హౌజ్ లోని వ్యక్తులను తమ సైనికులుగా తీసుకోవాలి. భరణికి నిఖిల్, ఇమ్మాన్యుయేల్ ఆడగా. శ్రీజకు సపోర్టుగా గౌరవ్, డిమోన్ లు ఆడారు.

శ్రీజకి సపోర్టుగా మాధురి

మొదటి లెవెల్లో శ్రీజ టవర్ బాక్స్ కి అవతల ఉంది. భరణిది ఒక బ్లాక్ అయిన అది బాక్స్ లో ఉంది. ఈ టాస్క్ కి సంచాలక్ గా ఉన్న సుమన్ భరణికి, కళ్యాణ్ శ్రీజకి సపోర్టుగా ఇచ్చారు. విన్నర్ ఎవరన్నది ఇద్దరు తేల్చకపోవడంతో సంచాలక్ ఎవరనేది వారినే తేల్చుకోమనడంతో శ్రీజ, భరణి మాధురిని ఎంచుకున్నారు. ఇక మాధురి వచ్చి బిగ్ బాస్ చెప్పిన విధంగా తీర్పు ఇచ్చింది. ఎవరి టవర్ లో ఎన్ని షీట్స్ ఉంటే వాళ్లే విన్ అన్నారు కాబట్టి.. ఈ రౌండ్ లో శ్రీజ గెలిచిందని తేల్చేసింది. రెండో లెవల్ జరిగిన పోరులో ఫస్ట్ లెవెల్లో ఎక్కువ బ్లాక్ లు పెట్టి శ్రీజ గెలిచింది. రెండో లెవెల్ కోసం జరిగిన ఆటలో డిమోన్, భరణి మధ్య తొపులాట జరిగి ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో పడ్డారు. ఇందులో భరణి తీవ్రంగా గాయాలు అవ్వడంతో భరణిని మెడికల్ ఎమర్జేన్సీ కోసం ఆస్పత్రికి పంపించారు.


రాజుతో తనూజ వార్

మాధురి శ్రీజకి సపోర్టు చేయడంతో తనూజ మాధురిపై కాస్తా కసురుకుంది. దీంతో ఇద్దరి మధ్య వార్ జరిగింది. తనకు నచ్చినట్టు ఉంటే మంచిగా ఉంటారు, అదే అపోజిట్ అయితే గొడవలు పడతారంటూ తనూజపై మాధురి అసహనం చూపించింది. ఆ తర్వాత హౌజ్ లో ఉల్లి.. లోల్లి మొదలైంది. రేషన్ మేనేజర్ గా ఉన్న తనూజ కళ్లు కప్పి ఉల్లిగడ్డ దొంగలించారు. అది కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కనుసందల్లోనే జరిగింది. ఈ విషయంలో హౌజ్ లో కాసేపు చర్చ మొదలైంది. రేషన్ మేనేజర్ అయిన తనూజను చూసి హౌజంత దడుసుకుంటుంది. తను పెట్టే కండిషన్స్, అవి దాటితే ఆమె పెట్టే చీవాట్లకు అంత భయపడిపోతున్నారు. ఫుడ్ మానిటర్ గా ఇలా ఉంటే ఇక కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో చూడాలిన డిమోన్ అనడంతో దివ్య.. అమ్మో ఆ ఊహానే భయంగా ఉందంది దివ్య. ఆ తర్వాత హౌజ్ ఇన్నర్ వాయిస్ అంటూ ఇమ్మాన్యుయేల్ చేసిన కామెడీ మామూలుగా లేదు. సుమన్ శెట్టి ఒక్కొక్కరి గురించి చెబుతుంటే హౌజ్ ఇన్నర్ వాయిస్ అంటూ వారిపై ఉన్న తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

హౌజ్ ఇన్నర్ వాయిస్ గా ఇమ్మాన్యుయేల్

గౌరవ్ తెలివైన వాడు అనగానే. కండబలం తప్ప బుద్ది బలం లేదు. వాడు తెలివైన వాడు ఏంటి. వాకిటాకి ఆన్ చేయకండ హాలో హాలో అంటున్నాడు. కేవ్ లో వినిపించక చచ్చిపోయాను. బుద్ది బలం పెంచుకోవాలి అని అంటాడు. తనూజ హౌజ్ చాలా కూల్ గా ఉంటుంది. ఎవరిపై అరవద, అస్సలు ఏడవదు అంటూ సుమన్ అంటే ఇమ్మాన్యుయేల్ తో సహా హౌజంత పగలబడి నవ్వుతుంది. ఇలా హౌజ్ లో కాసేపు సరదగా నవ్వులు విరిసాయి. ఆ తర్వాత పప్పు ఒక్క గరిటనే వేసుకోవాలని ఎక్కువ వేసుకోవద్దు తనూజ ఇమ్మాన్యుయేల్, సాయి వచ్చి చెబుతుంది. ఈ విషయాన్ని సంజనకు కూడా చెప్పమంది. ఇందులో ఆర్గ్యూమెంట్ పెరగడంతో సంజన తినకుండ మధ్యలోంచి లేచి వెళ్లిపోయింది. తనని ఫుడ్ మానిటర్ గా పెట్టకండి ఆమెకు మెచ్చ్యురిటీ లేదంటుంది. ఒక వైపు పప్పు గొడవ అవుతుంటే మధ్య సాయి వచ్చిన నాకు పప్పులో టమాటలు కావాలని ప్లేటు తనూజ ముందు పెట్టాడు. మరోవైపు డిమోన్, రీతూ గొడవ పడుతూనే ఉన్నారు. టామ్ అండ్ జెర్రీలా వారి గొడవ అసలు సద్దుమనగడం లేదు.

కలిసిపోయిన టామ్ అండ్ జెర్రీలు

మాధురి నన్ను నా క్యారెక్టర్ పాయింట్ అవుట్ చేస్తుంటే నువ్వేళ్లి వాళ్లతో మాట్లాడుతున్నావ్. అక్కడ బ్లేమ్ అవుతుంది నేను. వాళ్లకి ఎందుకు సమాధానం చెప్పడం లేదని అరుస్తుంది. దానికి పవన్ నేను చెప్పాలనుకుంది తాను చెప్పానని, ఏం తెలియకుండ మాట్లాడకంటూ రీతూపై సీరియస్ అయ్యాడు. చిలిచిలికి గొడవ గాలివానగా మారింది. వీరు ఎందుకు గొడవపడుతున్నారో, మళ్లీ ఎందుకు కలుస్తున్నారో అర్థమవ్వడం లేదంటూ మిగతవాళ్లంత చిరాకు పడుతున్నారు. అటూ కిచెన్ లో దివ్య, గౌరవ్ మధ్య మళ్లీ వార్ మొదలైంది. గౌరవ్ వచ్చి టీ అడగడంతో దివ్య అసహనం చూపించింది. ఇక్కడ కుకింగ్ డిపార్ట్ మెంట్ తనదని, తనకు చెప్పకుండ ఏం చేయడానికి పెట్టుకోవడానికి లేదంటూ కండిషన్ చెబుతుంది.. చెప్పావ్ కదా ఇక ఆపు అంటూ హ్యాండ్ గెస్చర్ చేశాడు. దీనికి దివ్య గౌరవ్ పై కోపంతో విరుచుకుపడింది. డిమోన్ పై అలిగిన రీతూని కూల్ చేసేందుకు ఇమ్మాన్యుయేల్ సరదగా సెటైర్స్ వేస్తూ ఇద్దరి మధ్య గొడవని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఫైనల్ గా భరణి హౌజ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం నేరుగా హౌజ్ లో అడుగుపెట్టాడు. దీంతో దివ్య, తనూజ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక కొట్టుకునేంతగా గొడవ పడ్డ పవన్, రీతూ మళ్లీ కలిసిపోయారు. పవన్ అన్నం తినిపిస్తూ అతడిపై రీతూ ప్రేమ కురిపించింది.

Related News

Bigg Boss 9 : రైస్ కి ఆ మాత్రం గోల పెట్టేసింది, ఈయనకి పప్పులో టమోటాలు కావాలట

Bigg Boss 9 : తనుజా కు ఎదురు తిరిగిన మాధురి, భరణి వచ్చాక వదిలేసింది అంటూ

Salman Khan: సల్మాన్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ రూ.200 కోట్లు…క్లారిటీ ఇచ్చిన నిర్మాత..అర్హుడంటూ!

Bigg Boss 9 Promo: టాస్క్ లో విపరీతమైన తొపులాట.. స్విమ్మింగ్ పూల్ లో పడ్డ భరణి, ఆస్పత్రికి తరలింపు

Bigg Boss 9: భరణి – శ్రీజ ఇద్దరు హౌస్‌లోనే.. చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss 9 Promo: రీఎంట్రీ ఫైర్.. చిరాకు దొబ్బుతున్నారు భయ్యా!

Bigg Boss 9: దివ్య మళ్లీ బంధాన్ని కొనసాగించాలి అని చూస్తుందా? గౌరవ్ గుప్తాతో ఆర్గ్యుమెంట్ అవసరమా?

Big Stories

×