Venky Trivikram : చాలామంది ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన ప్రాజెక్టులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు వెంకటేష్ సినిమా ఒకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి సినిమాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ కేవలం రచయిత మాత్రమే. త్రివిక్రమ్ కేవలం ఆ సినిమాలకు రచయిత అయిన కూడా దర్శకుడు కంటే ఎక్కువ పేరు త్రివిక్రమ్ కి వచ్చింది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ చూసినా కూడా ఆ సినిమా ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించేలా ఉంటుంది. కుటుంబం మొత్తం కూడా టీవీల ముందు కూర్చుని ఆ సినిమాను ఆస్వాదిస్తుంటారు. అయితే త్రివిక్రమ్ దర్శకుడు అయిన తర్వాత ఇప్పటివరకు వెంకటేష్ తో సినిమా చేయలేదు. మొత్తానికి వీరిద్దరూ ఇప్పుడు కలిసి సినిమా చేస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ నవంబర్ మొదటివారంలో మొదలుకానుంది. శ్రీనిధి శెట్టి మరియు వెంకటేష్ మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి కామెడీను వెంకటేష్ కు రాశారు. అయితే ఇప్పుడు దర్శకుడిగా ఎటువంటి సినిమాలు డీల్ చేస్తున్నారు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. ఖచ్చితంగా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనే క్లారిటీ చాలామందికి ఉంది. ఎందుకంటే వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అలాంటిది.
త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడంలో ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి కూడా అత్తారింటికి దారేది లాంటి ప్రాజెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా యూత్ ను టార్గెట్ చేసేలా ఉండేది.
మామూలుగా ఒక స్టార్ హీరో దొరికినప్పుడు చాలామంది కమర్షియల్ కథను చెప్పాలి అనుకుంటారు. కానీ ఒక స్టార్ హీరో కుటుంబ విలువలు ఉన్న సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేది సినిమా. ఆ సినిమా ఇప్పుడు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్.
Also Read: Rahul Ravindran: అత్తారింటికి దారేది సినిమా రిజెక్ట్ చేశాను, అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి?