Andhra King Taluka : చాలామంది హీరోలకు విపరీతమైన టాలెంట్ ఉంటుంది కానీ కొన్ని సినిమా కథలను ఎంచుకునే విధానంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు అని అర్థమైపోతుంది. అందుకే సక్సెస్ రేట్ వాళ్లకు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ముందు చేసిన సినిమాలతో వాళ్లకి మంచి గుర్తింపు రావడంతో, అలానే కొంతమంది అభిమానులు వాళ్లను విపరీతంగా ప్రేమించడంతో ఇండస్ట్రీలో సర్వైవ్ అయిపోతుంటారు.
రామ్ పోతినేనికి విపరీతమైన టాలెంట్ ఉంది. తాను చేసిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ కు సరైన హిట్ సినిమా పడలేదు. అయితే రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. అయితే ఈ సినిమా ఈవెంట్ వైజాగ్ లో ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. కానీ ప్రస్తుతం వస్తున్న తుఫాను వలన ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే మరో ఈవెంట్ను ఎక్కడ ప్లాన్ చేస్తారో త్వరలో చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.
ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రారా కృష్ణ ఏ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. సందీప్ కిషన్ నటించిన ఆ సినిమా ఒక డీసెంట్ సక్సెస్ అందుకుంది.
నవీన్ పోలిశెట్టి అనుష్క నటించిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. ఆ సినిమాను నవీన్ పోలిశెట్టి ప్రమోట్ చేసిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. నవీన్ ప్రమోషన్ వాళ్ళనే చాలా మంది థియేటర్ కు వచ్చారు.
ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా ఒక అభిమానికి సంబంధించినది. అభిమానులు చాలామంది హీరోలను ఇష్టపడుతుంటారు. వాళ్ల మీద విపరీతమైన ప్రేమను చూపిస్తుంటారు. దానికి బదులుగా హీరోలు ఏం చేస్తున్నారు అని అంశాన్ని కూడా ఈ సినిమాలో మాట్లాడారు అని తెలుస్తుంది.
ఎంతసేపు ఫ్యాను ఫ్యాను అంటుంటావ్ అసలు నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ హీరోకు తెలియదు అంటూ మురళీ శర్మ చెప్పిన డైలాగ్ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతుంది. సినిమా ఫలితం ఎలా ఉంటుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.
Also Read: Pradeep Ranganathan : ఈసారి మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం లేదు