BigTV English
Advertisement

SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?

SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?

SYG : రేయ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంటర్ ఇచ్చాడు సాయి తేజ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. వాస్తవానికి ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా వైరల్ గా మారింది. ఇండస్ట్రీ కేవలం మెగా ఫ్యామిలీకి మాత్రమే సంబంధించింది కాదు అని కూడా అప్పట్లో కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆడియో లాంచ్ కి రావడంతో చాలామంది సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందించారు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది.


రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు సాయి తేజ్. సాయి తేజ్ కెరియర్లో సక్సెస్ఫుల్ సినిమాలు కంటే కూడా ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. దీనిపై చాలామంది మెగా అభిమానులు కూడా కామెంట్ చేశారు. సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో మామయ్యని మించిపోయాడు అంటూ అప్పట్లో ట్రోల్ కూడా చేశారు.

సంబరాల ఏటిగట్టు కాన్సెప్ట్

సాయి తేజ్ కెరియర్ లో ఒక ఊహించని సంఘటన జరిగింది. రిపబ్లిక్ సినిమా తర్వాత సాయి తేజ్ చేసిన సినిమా విరూపాక్ష. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాతోనే ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సాయి తేజ్.


ఇక ప్రస్తుతం సాయి తేజ నటిస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. సినిమాకు సంబంధించి దాదాపు 30 రోజులు షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అధిక కులాలకు సంబంధించిన వాళ్ళు, అణగారిన కులాలను ఇబ్బంది పెట్టడం వలన, ఈ అణగారిన కులాలు ఎలా వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు అనే కాన్సెప్టులో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

తమిళ దర్శకులు ఇన్స్పిరేషన్ 

మామూలుగా ఇటువంటి సినిమాలు అన్నీ కూడా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో వస్తుంటాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి కాన్సెప్ట్ తో సినిమాలు చాలా తక్కువ. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన పలాస వంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా పెద్దగా ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించలేదు. ఈ సినిమాకు కరోనా ఆటంకం కూడా కలిగింది. ఒక సాయి తేజ నటిస్తున్న సంబరాలు ఏటిగట్టు సినిమాకు ఏ రేంజ్ సక్సెస్ అందుతుందో వేచి చూడాలి.

Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై తుఫాన్ ప్రభావం, ఈవెంట్ క్యాన్సిల్

Related News

Rahul Ravindran: అత్తారింటికి దారేది సినిమా రిజెక్ట్ చేశాను, అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి?

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?

Ravi Teja : చిరంజీవి దర్శకుడితో రవితేజ సినిమా, డిస్కషన్స్ జరుగుతున్నాయి 

Suriya: మరో తెలుగు డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై తుఫాన్ ప్రభావం, ఈవెంట్ క్యాన్సిల్

MassJathara vs Bahubali The Epic: మాస్ జాతర vs బాహుబలి ది ఎపిక్.. బాక్సాఫీస్ విజేత ఎవరు?

Pradeep Ranganathan : ఈసారి మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం లేదు

Big Stories

×