E-Paper
Advertisement

MSVPG: ఇదెక్కడి విడ్డూరం.. సొంత సంస్థపై కాపీ రైట్!

MSVPG: ఇదెక్కడి విడ్డూరం.. సొంత సంస్థపై కాపీ రైట్!
Advertisement

MSVPG: సాధారణంగా ఇప్పటివరకు మనం ఒక సినిమాను చిత్రీకరిస్తున్నారు అంటే.. ఆ సినిమా నుండి ఏదైనా ఫోటో, వీడియో లేదా మరేదైనా షూటింగ్ లోకేషన్ కి సంబంధించిన విషయాలు.. హీరో, హీరోయిన్ లుక్స్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయంటే వాటిని లీక్ చేసిన వారిపై నిర్మాతలు మండిపడడమే కాకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది తమ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను, ఫోటోలను నెటిజన్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా మరే సినిమాలోనైనా ఉపయోగించుకుంటే మాత్రం కాపీరైట్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం నిర్మాతలే తమ సొంత సోషల్ మీడియా అకౌంట్లో పై కాపీరైట్ వేయడం సంచలనంగా మారింది.

సొంత సోషల్ మీడియా ఖాతాపై కాపీరైట్..

ముఖ్యంగా తమ సినిమాల విషయాలను లీక్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో కాపీ రైట్ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. నెటిజన్స్ పై నిర్మాతలు కాపీ ఆరోపణలు చేయాలి కానీ ఇలా సొంత సోషల్ మీడియా ఖాతాల పై కాపీ ఆరోపణలు చేయడం ఏంటి? ఇదెక్కడి విడ్డూరం.. అంటూ చర్చిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గమనించని షైన్ స్క్రీన్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న సైన్ స్క్రీన్ సంస్థ సొంత సోషల్ మీడియా పైనే కాపీరైట్ స్ట్రైక్ పడడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ ను నిన్న సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేశారు. పైగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తిరుపతిలోని ఎస్ వి సినీ ప్లెక్స్ లో మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై అప్డేట్ ఇస్తూ షైన్ స్క్రీన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్టులో కింద ఫోటో కాపీ రైట్ స్ట్రైక్ పడడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది.

ALSO READ:Richest Actor’s: టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. టాలీవుడ్ హీరోల స్థానం?

షైన్ స్క్రీన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్..

Advertisement

ఇకపోతే ఇలా సొంత సోషల్ మీడియా ఖాతాలో కాపీరైట్ స్ట్రైక్ పడడంతో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.సొంత సంస్థపై కాపీరైట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని షైన్ స్క్రీన్ సంస్థ గమనించలేదేమో తెలియదు కానీ జరిగిన చిన్న పొరపాటు మాత్రం ఇప్పుడు ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తోంది అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×