E-Paper
Advertisement

Viral News: బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి.. సీఈవోకు ఉద్యోగి మెయిల్!

Viral News: బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి.. సీఈవోకు ఉద్యోగి మెయిల్!
Advertisement

Breakup Leave:

అత్యవసర సమయాల్లో ఉద్యోగులు లీవ్ తీసుకోవడం కామన్. కానీ, కొంత మంది లీవ్ కోసం చెప్పే కారణాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. అదే సమయంలో షాకింగ్ గా ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్రేకప్ అయ్యింది.. ఆ బాధ నుంచి బయటపడేందుకు లీవ్ కావాలని ఓ యువకుడు బాస్ కు మెయిల్ చేశాడు. “హలో సర్.. రీసెంట్ గా నాకు బ్రేకప్ అయ్యింది. నేను వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. నాకు షార్ట్ బ్రేక్ కావాలి. ఇవాళ నేనే వర్క్ ఫ్రమ్ హోం చేస్తాను. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు లీవ్ తీసుకుంటాను” అని అందులో రాశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా గురుగ్రామ్ కు చెందిన నాట్ టేడింగ్ సంస్థ సీఈవో జస్వీర్ సింగ్ ఈ ఈమెయిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తన జీవితంలోనే అత్యంత నిజాయితీతో కూడిన లీవ్ లెటర్ గా ఆయన అభివర్ణించారు. జెన్ జెడ్ ఉద్యోగులు మానసిక సమస్యలను బహిరంగపరచుకుంటున్నారని ఆయన వెల్లడించారు. బాధ నుంచి బయటపడి మళ్లీ ఉద్యోగానికి రావడం మంచి పద్దతి అన్నారు. అదే పనిగా బాధపడుతూ కూర్చోవడం మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో చాలా మంది లవ్ ఫెల్యూర్ తర్వాత అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది ఏమాత్రం మంచిదికాదన్నారు. రిజెక్షన్ అనేది ఎవరికైనా బాధను కలిగిస్తుందన్న ఆయన, దాని నుంచి బయటపడాలే కానీ, అదే పనిగా బాధపడకూడదన్నారు. ఒక ఛాన్స్ మిస్ అయితే, మరో మంచి అవకాశం వస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు.

Advertisement

Read Also:  రూ.20 సమోసాకు కక్కుర్తి పడితే.. రూ.3 లక్షలు స్వాహా, తినే ముందు ఆలోచించండి!

బాస్ ఏం చేశారంటే?

Advertisement

ఉద్యోగి నుంచి లీవ్ కోసం వచ్చిన రిక్వెస్ జన్యూన్ గా అని భావించిన సీఈవో జస్వీర్ సింగ్ వెంటనే సెలవు మంజూరు చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా ఆ బాధ నుంచి బయటపడి మళ్లీ ఆఫీస్ కు రావాలని ఆకాంక్షించారు. ఈసీవో తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అర్థం చేసుకునే వ్యక్తి సీఈవోగా ఉండటం నిజంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు వరం అంటున్నారు. అదే సమయంలో సదరు ఉద్యోగి కూడా వీలైనంత త్వరగా తన బాధ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. ఇష్టపడిన వారు దూరంగా వెళ్లిపోవడం బాధ కలిగించినా, కొన్నిసార్లు వదిలిపోయిన వారి గురించి ఆలోచించకపోవడం మంచిదంటున్నారు. వాళ్ల బాస్ చెప్పినట్లు ఒక అవకాశం కోల్పోతే, దాని కంటే మంచి అవకాశం వస్తుందనే ఆలోచనలో ఉండాలంటున్నారు. మొత్తంగా ఈ బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also:  బంగారం పెట్టుకుంటే భారీ జరిమానా.. ఉత్తరాఖండ్ గ్రామంలో వింత రూల్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×