Kantara Makers About Early OTT Release: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. దసరా పండుగ సందర్భంగా విడదులైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది. కాంతార 1కి పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో దీనికి మరింత కలిసి వచ్చింది. దీంతో ఇప్పటీకి కాంతార థియేటర్లకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. అయితే ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తికాకముందే ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 31 నుంచి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైం ప్రకటించింది.
దీంతో ఆడియన్స్ అంత షాక్ అవుతున్నారు. అదేంటి ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీకి రావడమేంటని ప్రేక్షకుల్లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. అంతేకాదు థియేటర్లలో ఉన్న మూవీని ఓటీటీకి తీసుకువస్తే కలెక్షన్స్ ప్రభావం పడే అవకాశం ఉంది. అయినా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణమేంటని అందరిని తోలుస్తున్న ప్రశ్న. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం, ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రాన్ని నాలుగు వారాల్లోనే ఓటీటీకి తీసుకురావడమేంటో అంటూ నెటిజన్స్ మాట్లాడకుంటున్నారు. హొంబలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ కాంతార 1 ఓటీటీ రిలీజ్ పై స్పందించారు.
ఇంత త్వరగా మూవీని ఓటీటీకి తీసుకురావడం వెనక కారణమేంటో వివరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుంది. ‘ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో మాత్రమే ఓటీటీకి వస్తుంది. హిందీ వెర్షన్ వచ్చేది ఇప్పుడు కాదు. ఎనిమిది వారాల తర్వాత హిందీ వెర్షన్ ఓటీటీకి వస్తుంది. ఎందుకంటే కాంతార ఓటీటీ ఢీల్ మూడేళ్ల క్రితమే జరిగింది. అందుకే ఒప్పందం ప్రకారం మూవీని ఓటీటీకి తీసుకువస్తున్నాం. ఇది మా వంతు బాధ్యత. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కొవిడ్ ముందు సినిమాలన్ని ఎనిమిది వారాలకే ఓటీటీకి వచ్చేవి. కానీ, కొవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి.
Also Read: Bigg Boss 9 day 51: శ్రీజ దెబ్బకు ఏడ్చిన మాధురి.. రీఎంట్రీ లో ట్విస్ట్.. తనూజపై ఇమ్మూ గాసిప్స్
థియేట్రికల్ రన్ పూర్తవ్వకుండానే సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి. అలాగే కాంతార 1 కూడా ఓటీటీలో విడుదలైన థియేటర్ కొనసాగుతుంది. మూవీ ఓటీటీకి రావడం వల్ల 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే కలెక్షన్లపై ప్రభావం ఉంటుంది. అయినా మా సినిమాని థియేటర్లలో ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా కాంతార మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. హిందీలోనూ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా విడుదలైన థామా, ఏక్ దీవానే కి దేవానియాత్ వంటి బాలీవుడ్ చిత్రాలు వచ్చినప్పటికీ కాంతార 1 హిందీ వెర్షన్ వాటిని కూడా అధిగమిస్తూ హిందీ బాక్సాఫీసు వద్ద దూకుడు చూపిస్తోంది. కాగా అక్టోబర్ 2న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే.