BigTV English
Advertisement

Sreeleela: మాస్ జాతర ఎఫెక్ట్.. ఆ తప్పు చేయనంటున్న శ్రీ లీల.. ఏమైందంటే?

Sreeleela: మాస్ జాతర ఎఫెక్ట్.. ఆ తప్పు చేయనంటున్న శ్రీ లీల.. ఏమైందంటే?

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreelela)ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈమెకు మాత్రం ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అందించలేకపోతుందని చెప్పాలి. ఇటీవల కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా నిరాశ పరిచాయి. ఇకపోతే తాజాగా రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర(Mass Jathara) అనే సినిమా ద్వారా శ్రీ లీల ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.


స్పెషల్ సాంగ్స్ కు దూరం..

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్యాకప్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇలా వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో శ్రీ లీల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ స్పెషల్ సాంగ్ లో తాను నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు ఒక మంచి ప్లాట్ ఫామ్ గా మారిందని వెల్లడించారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడ వల్ల కొంతవరకు తన కెరియర్ పై దెబ్బ పడిందని కూడా వెల్లడించారు.

నటిగా గుర్తించడం లేదు..

పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఒక ప్రాజెక్టులో భాగం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. కానీ ఇకపై తాను ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అసలు చేయనని వెల్లడించారు. ఇలా స్పెషల్ సాంగ్ లో తాను నటించడం వల్ల చాలామంది నన్ను బెస్ట్ డాన్సర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలా నన్ను ఒక డాన్సర్ గా మాత్రమే చూస్తున్నారు తప్ప నటిగా గుర్తించడం లేదని అందుకే ఇకపై తాను స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన కూడా చేయనని తెలిపారు.


ప్రమాదంలో శ్రీ లీల కెరియర్..

ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయటం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ లీల బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె మూడు బాలీవుడ్ ప్రాజెక్టులలో భాగమైనట్టు తెలుస్తుంది. మరి బాలీవుడ్ సినిమాల ద్వారా అయిన ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ వచ్చేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే రవితేజతో నటించిన ధమాకా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన శ్రీ లీల పెద్దగా సక్సెస్ అందుకోలేదు బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టారు. ఇక మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించిన కూడా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపై కథల ఎంపిక విషయంలో శ్రీ లీల కాస్త జాగ్రత్తలు వహించకపోతే సినీ కెరియర్ కోల్పోయే ప్రమాదం ఉందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Also Read: Prashanth Varma: నిర్మాతలతో వివాదం.. మౌనం వీడిన ప్రశాంత్ వర్మ..ప్రతీకార చర్యలంటూ!

Related News

Suriya46 : వెంకీ అట్లూరి, సూర్య సినిమా ఓటీపీ బిజినెస్ అయిపోయింది, ఎన్నికోట్లో తెలుసా?

Shahrukh Khan: పుట్టినరోజు వేళ నిరాశలో అభిమానులు.. క్షమాపణలు చెప్పిన షారుక్ !

Singer Chinmayi: కర్మ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి సంచలన పోస్ట్!

Tollywood Comedian: డీజేగా మారిన టాలీవుడ్ కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా?

Skn : మెగాస్టార్ చిరంజీవి పేరుని ఎలా వాడుకోవాలో చెప్పిన నిర్మాత ఎస్ కే ఎన్

Dhanush : ధనుష్ 55వ సినిమాలో ఆ ప్లాప్ హీరోయిన్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

HBD Shahrukh Khan: బర్తడే రోజు చిన్న మిస్టేక్.. ట్రోల్స్ ఎదుర్కొంటున్న ‘కింగ్’!

Dhanush : పద్ధతి మార్చుకున్న మారి సెల్వరాజ్, ధనుష్ సినిమా ఎలా ఉండబోతుంది? 

Big Stories

×