E-Paper
Advertisement

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్..  షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్
Advertisement

Big Shock To Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రాజకీయ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే వార్ పవర్స్ తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఫలితంగా 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో ట్రంప్ ఫ్యూచర్‌పై నీలి నీడలు మొదలయ్యాయి.

ట్రంప్‌కు ఊహించని షాకిచ్చిన వార్ పవర్స్

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రతినిధుల సభలో గట్టి షాక్ తగిలింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 215, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ దూకుడుగా వెళ్లకుండా అడ్డకట్ట వేసింది ప్రతినిధుల సభ.

ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటన చేశారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ క్లోజ్ అయినట్టు తెలిపారు. తాము చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని, ఇరాన్ రక్షణ రంగ పరిశ్రమలను దెబ్బతీశామని వెల్లడించారు. ఇకపై ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బ తీసేందుకు అమెరికా దాడులు చేయబోదని తేల్చిచెప్పారు.

Advertisement

ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్-అమెరికా విదేశాంగ ప్రకటన

ఇకపై ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేయాలంటే కొత్త సైనిక చర్యల కోసం అమెరికా పార్లమెంట్‌ అనుమతి తప్పనిసరి అయ్యింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని తీర్మానం స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏంటంటే.. తీర్మానానికి నలుగురు రిపబ్లికన్లు మద్దతు తెలిపారు. దీంతో సొంత పార్టీలో ట్రంప్‌కు నిరసనలు మొదలయ్యాయి.

అమెరికా తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు ఇది గట్టి సందేశమని, ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. మూడు నెలల కిందట ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి టెహ్రాన్‌పై సైనిక చర్యలను నిలిపి వేయాలని ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చే ఒక చర్యను రిపబ్లికన్ల ఆధీనంలోని ప్రతినిధుల సభ ఆమోదించడం ఇదే మొదటిసారి.

ALSO READ: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

గతంలో ఆ తరహా తీర్మానం సభ ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. మే నెలలో జరిగిన ఓటింగ్‌లో తీర్మానం విఫలమైంది. ఈసారి అదనపు మద్దతు లభించడంతో సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం ఇప్పుడు సెనెట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కొందరు రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారు. సెనెట్‌ ఆమోదించినా ట్రంప్‌.. దీనిపై వీటో విధించే అవకాశం ఉందని అమెరికా మీడియా చెబుతోంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×