Srinidhi Shetty : తను నటించిన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకుంది శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సంచలనమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాతే కన్నడ ఫిలిం ఇండస్ట్రీ మీద కూడా చాలామందికి విపరీతమైన గౌరవం పెరిగింది.
ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో సక్సెస్ సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా కేజీఎఫ్ 2 సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. కే జి ఎఫ్ సినిమాతో శ్రీనిధి శెట్టికి మంచి పేరు వచ్చింది అనే మాట వాస్తవమే. కానీ తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం నాని నటించిన హిట్ 3 సినిమా ప్రమోషన్స్. ప్రతి ప్రమోషన్స్ లోనూ కూడా శ్రీనిధి శెట్టి హైలెట్ అయింది. సినిమా విడుదల కాకముందే శ్రీనిధికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.
శ్రీనిధి శెట్టి చూడటానికి ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది. నాని కూడా మాట్లాడుతూ ఈ అమ్మాయికి అసలు ఫిల్టర్ లేదు అని హిట్ 3 సినిమాకి సంబంధించిన ఫంక్షన్ లో చెప్పాడు. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది శ్రీనిధి శెట్టి. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన ఈ సినిమాతో దర్శకురాలుగా మారారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది శ్రీనిధి.
ఒక ప్రముఖ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది శ్రీనిధి శెట్టి. తాను 10వ తరగతి చదువుతున్న టైంలోనే శ్రీనిధి శెట్టి మదర్ చనిపోయారట. అయితే శ్రీనిధి తో పాటు వాళ్ళ ఇద్దరు అక్కలను కూడా వాళ్ళ నాన్న చదివించి అన్నీ చూసుకున్నారట. కేవలం మా నాన్న తండ్రి మాత్రమే కాదు, ఒక ఫ్రెండ్ , ఒక అమ్మ అన్నీ కూడా ఆయనే చూశారు అంటూ శ్రీనిధి శెట్టి ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయిపోయారు.
చాలామంది పైకి నవ్వుతూ కనిపిస్తారు గాని వాళ్ళ లో లోపల చాలా బాధలు ఉంటాయి. ఒకరు చాలా సంతోషంగా నవ్వుతున్నారు అంటే వాళ్లు జీవితంలో అధికమైన దుఃఖాన్ని దాటి వచ్చి ఉంటారు అనేది ఎక్కువ శాతం మంది చెప్పే మాట. ఏ ఇంటర్వ్యూ చూసినా నవ్వుతూ కనిపించే శ్రీనిధి వెనుక ఇంత కన్నీటి గాథ ఉంది అని శ్రీనిధి చెప్పిన వరకు కూడా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
Also Read: Mass Jathara: మాస్ మహారాజ్ తో రచ్చ చేసిన హైపర్ ఆది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్