BigTV English

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Government: విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎయిర్ బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్ తో పాటు ఎయిర్ బస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు. మేకిన్ ఇండియా, స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డ్ మొదటిసారి భారతదేశానికి రావడం జరిగింది.


రాష్ట్రంలో ఎయిర్ బస్ ఆధారిత ప్రపంచస్థాయి ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పనిచేసేలా ప్రతిపాదనను మంత్రి లోకేష్ వారి ముందుంచారు. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు ప్రాజెక్ట్ వేగవంతంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరో స్పేస్ పాలసీని వివరించారు. తద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

ALSO READ: Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు


ప్రధాన యూనిట్ తో పాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ను కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్క్ లు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృతస్థాయిలో తయారీ సాధ్యం అవుతుందని వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్ లలో అనేక సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఎయిర్ బస్ ప్రోగ్రామ్ అవసరాలకు, సరఫరాదారుల క్లస్టరింగ్, రవాణ సౌకర్యాలు, భవిష్యత్ విస్తరణలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు.

ALSO READ : SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

ఈ భేటీ కోసమే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా న్యూఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడిదారుల ప్రాధాన్య విధానాన్ని, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్ధిష్ట గడువులోగా ప్రాజెక్ట్ అమలు వంటి అంశాలతో పాటు చంద్రబాబు గారి బ్రాండ్, ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ఆయన ట్రాక్ రికార్డ్ ను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఎయిర్ బస్ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Related News

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Govt: పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లులు విడుదల

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Tirumala: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Big Stories

×