Varun Tej son: మెగా ఇంట ఇటీవల అన్ని శుభవార్తలే వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా హిట్ కావడం, ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10వ తేదీ లావణ్య త్రిపాఠి బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మెగా ఇంట్లోకి వారసుడు వచ్చారంటూ సంబరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా లావణ్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నారితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా ఈ చిన్నారికి బారసాల వేడుకను(Cradle Ceremony) ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
నేడు సాయంత్రం ఈ వేడుక ఎంతో ఘనంగా జరగబోతుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇలా ఈ బారసాల వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ ఇంటికి చేరుకుంటున్నారు. మెగా కుటుంబంలో మూడో తరం మొదటి వారసుడు కావడంతో ఈ చిన్నారికి సంబంధించిన ప్రతి ఒక్క వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ చిన్నారికి ఏం పేరు పెడతారు? ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
మెగా హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులకు వారసురాలు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ కు అబ్బాయి పుట్టడంతో మెగా ఇంటికి వారసుడొచ్చాడంటూ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ చిన్నారి ఎలా ఉన్నాడు ఏంటి అనే విషయాలను మాత్రం ఎవరు వెల్లడించలేదు, బాబు ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి 2023వ సంవత్సరంలో ఎంతో ఘనంగా ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. ఇలా పెళ్లయిన రెండు సంవత్సరాలకు ఈ జంట తల్లిదండ్రులుగా మారడంతో అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు..
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి రెండు సినిమాలలో జంటగా నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, రహస్యంగా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీలో వివాహం జరుపుకున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి పెద్దగా బయట కనిపించలేదు అయితే ఈమె పెళ్లి తర్వాత కూడా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో సతి లీలావతి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత లావణ్య త్రిపాఠి తదుపరి సినిమాలకు కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం బాబు జన్మించడంతో కొంతకాలం పాటు లావణ్య ఇండస్ట్రీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Sobhita Dhulipala : అరుదైన గౌరవం అందుకున్న శోభిత.. ఇండియాలోనే మొదటి మహిళగా!