Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) పరిచయం అవసరం లేని పేరు. ఈమె అచ్చ తెలుగు నటి అయినప్పటికీ ఈమె ఎంట్రీ మాత్రం బాలీవుడ్ సినిమాల ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులకు మెప్పించారు. ఇలా ఈమె తెలుగు సినిమాలలో కంటే బాలీవుడ్ సినిమాల ద్వారానే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక శోభిత తెలుగులో చాలా తక్కువ సినిమాలనే చేశారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరోతో ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడి గత ఏడాది ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత శోభిత ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక శుభవార్తను తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి శోభిత చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి అనే విషయానికి వస్తే…షార్లెట్ టిల్బరీ (charlotte tilbury )అనే సౌందర్య ఉత్పత్తులకు ఈమె మొట్టమొదటి భారతీయ బ్యూటీ మ్యూజ్‌గా ఎంపిక అయింది.
ఇలా షార్లెట్ టిల్బరీ బ్రాండ్ కు మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ గా శోభిత ఎంపిక కావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలను శోభితో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలోనూ అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి సెలెబ్రెటీలు ఈ విధమైనటువంటి బ్రాండ్లను ప్రచారం చేస్తూ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక శోభిత కూడా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
శోభిత కెరియర్ విషయానికి వస్తే… శోభిత నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాల షూటింగ్ పనులను పూర్తి చేసినట్టు తెలుస్తుంది .అయితే ఏ సినిమాలలో నటిస్తున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు కానీ శోభిత మాత్రం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన శోభిత 2013 సంవత్సరంలో మిస్ ఇండియా అందాల పోటీలలో రెండో స్థానంలో నిలిచారు. ఇలా మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బాలీవుడ్ దర్శకుడు 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా వెండి తెరపై సందడి చేశారు. ఇక తెలుగులో అడవి శేష్ నటించిన గూడచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారా అనంతరం మేజర్ సినిమాలో కూడా నటించి సందడి చేశారు.
Also Read: Actress Hema: ఇంద్రకీలాద్రిపై కన్నీళ్లు పెట్టుకున్న హేమ… చేయని తప్పుకి బలి అంటూ