BigTV English

Actress Hema: ఇంద్రకీలాద్రిపై కన్నీళ్లు పెట్టుకున్న హేమ… చేయని తప్పుకి బలి అంటూ

Actress Hema: ఇంద్రకీలాద్రిపై కన్నీళ్లు పెట్టుకున్న హేమ… చేయని తప్పుకి బలి అంటూ

Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ(Hema) ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఒకానొక సమయంలో వరుస సినిమాల ద్వారా పిన్ని, అత్త, అక్క పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమా తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమాలను కాస్త తగ్గించారు. తాజాగా నటి హేమ నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని (Durgamma Temple) సందర్శించారు. ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలలో భాగంగా హేమ అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి కి చేరుకుంటారు.


దుర్గమ్మ సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్న నటి..

తాజాగా ఈమె అమ్మవారి దర్శనం కోసం విజయవాడ రావడమే కాకుండా దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా హేమా మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందని అయితే ఈరోజు అమ్మవారి దర్శనానికి ఓ ప్రత్యేకత ఉందని తెలిపారు. గత ఏడాది నాపై వచ్చిన నిందలు అన్ని తుడిచి వేయడంతో ఈరోజు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా నేను అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు.. నేను చేయని తప్పుకు మీరందరూ కలిసి నన్ను బలి చేశారు అంటూ ఈమె మీడియా వారిని ఉద్దేశించి ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.

చేయని తప్పుకు నిందలు మోసాను..

ఇలా చేయని తప్పుకు నిందలు మోయడం చాలా బాధనిపించింది. ఆ బాధ నుంచి బయటపడటం నావల్ల కాలేదని తెలిపారు. ప్రతిక్షణం అమ్మవారే నీకు నేనున్నాను ధైర్యంగా ముందుకెళ్లు అంటూ నన్ను ముందుకు నడిపించారని ఈమె తెలిపారు. ఎన్ని జన్మలెత్తిన కనకదుర్గమ్మ ఇచ్చిన ఆశీస్సులను కానీ, ఆమె ఇచ్చిన అండదండలను కానీ తాను మర్చిపోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మళ్లీ ఇలా మీ అందరిని కలుసుకొని మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే దయచేసి మీరు ఏదైనా ఒక వార్త రాసేముందు నిజా నిజాలు తెలుసుకొని వార్తలు రాయండి అంటూ ఈ సందర్భంగా మీడియాని కోరారు.


ఈరోజు అమ్మవారి గుడిలో ఉండి చెబుతున్నాను నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పోలీసులకు దొరికారు అంటూ అప్పట్లో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే హేమ ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు బయటకు రావడంతో ఏకంగా మా అసోసియేషన్ కూడా ఈమె పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక చివరికి హేమ తప్పలేదని నిర్ధారణ కావడంతో ఈ గండం నుంచి ఈమె బయటపడ్డారు. ఇలా డ్రగ్స్ వివాదం కారణంగా ఈమె వార్తల్లో నిలవడంతో అప్పటినుంచి పెద్దగా బయట ఎక్కడ కనిపించడానికి కూడా హేమ ఇష్టపడట్లేదు. అయితే నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఈమె మీడియా ముందు తన ఆవేదన మొత్తం వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు.

Also Read: Chiranjeevi: మెగా 158 లో ప్రభాస్ హీరోయిన్.. బాబీ ఎంపిక సరైనదేనా?

Related News

Varun Tej son: మెగా ఇంట మరో వేడుక..ఘనంగా మెగా వారసుడు బారసాల వేడుక!

Mahima Nambiar: ఇదే చివరి హెచ్చరిక.. కఠిన శిక్ష తప్పదంటూ హీరోయిన్ వార్నింగ్!

Sobhita Dhulipala : అరుదైన గౌరవం అందుకున్న శోభిత.. ఇండియాలోనే మొదటి మహిళగా!

Prabhas : ప్రభాస్ పెళ్లిపై మళ్ళీ స్పందించిన శ్యామలాదేవి.. ఫ్యాన్స్ అసహనం!

Pawan Kalyan OG : స్వయంగా ఓజి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్, ట్రోల్స్ కు మళ్ళీ అవకాశం

Srinidhi Shetty : చిన్న ఏజ్ లోనే అమ్మ చనిపోయింది, శ్రీనిధి కనిపించే నవ్వుల వెనక కన్నీటి గాథ 

Chiranjeevi: మెగా 158 లో ప్రభాస్ హీరోయిన్.. బాబీ ఎంపిక సరైనదేనా?

Big Stories

×