Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా అవ్వడమే కాకుండా యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈయన వశిష్ట దర్శకత్వంలో “విశ్వంభర” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈయన “మన శంకర వరప్రసాద్ గారు” అనే సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా చిరంజీవి మరొక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిట్ అయిన విషయం తెలిసిందే .ఈ సినిమాని స్వయంగా నాచురల్ స్టార్ నాని నిర్మిస్తూ ఉండటం విశేషం. ఇలా ఈ సినిమాతో పాటు డైరెక్టర్ బాబి కొల్లి (Boby Kolli)తో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అయింది. తాజాగా మరో సినిమాని కూడా ప్రకటించారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఈ సినిమాలో చిరంజీవి కోసం డైరెక్టర్ బాబి అద్భుతమైన కథను సిద్ధం చేశారని, ఈ సినిమా ద్వారా మరో కొత్త చిరంజీవిని చూడబోతున్నామని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా డైరెక్టర్ బాబి అనుష్క శెట్టి(Anushka Shetty)ని ఎంపిక చేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాలోని నటించలేదు.
స్టాలిన్ సినిమాలో తళక్కుమన్న అనుష్క..
చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఒక పాటలో చిరంజీవి పక్కన తళక్కుమన్న అనుష్క హీరోయిన్గా మాత్రం సినిమా చేయలేదు. ఈ క్రమంలోనే బాబి డైరెక్షన్లో చిరంజీవి నటించబోతున్న సినిమాలో అనుష్క అయితే బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఫర్ ఫెక్ట్ జోడి అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది, అనుష్క విషయంలో డైరెక్టర్ బాబి తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చిరంజీవి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక అనుష్క ఇటీవల ఘాటీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.
Also Read: Actor Darshan: దర్శన్‌కు మొత్తటి పరుపు ఇవ్వండి… కోర్టులో విచారణ