BigTV English

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Weather News: తెలంగాణలో గత పది రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా వర్షం దంచికొడుతోంది. సాయంత్రం, రాత్రి వేళల్లో భాగ్యనగరంలో కుండపోత వాన కురుస్తోంది. వర్షం వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. సాయంత్రం నుంచి మొదలవుతున్న వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ముగ్గురు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కొడుతోంది .మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడుతోంది. అయితే గత రెండు రోజుల నుంచి భాగ్యనగరంలో పెద్దగా వర్షాలు పడలేదు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది.


ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షం

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో అక్కడ ఉరుములు, మెరుపుల వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


ALSO READ: TVK Vijay: తొక్కిసలాటలో 41 మంది మృతి.. స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

కాసేపట్లో ఈ  ప్రాంతాల్లో భారీ వర్షం..

మరో గంట సేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నం నుంచి పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ALSO READ: SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త..!

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు.

Related News

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Hyderabad News: లోకల్ బాడీ ఎన్నికల్లో 80 శాతం మావే.. జీవోపై ఆ రెండు పార్టీలు కోర్టుకు?- టీపీసీసీ

Telangana: దసరా వేళ దారుణం.. ఆ ఊరిలో బతుకమ్మ ఆడనివ్వని ఊరి పెద్దలు, ఏం జరిగింది?

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..? వర్షాలు దసరా వరకు దంచుడే.. దంచుడు..

Kavitha: నాపై ఎన్నో కుట్రలు జరిగాయి.. బిగ్ బాంబ్ పేల్చిన కవిత

VC Sajjanar: ఆర్టీసీతో నాలుగేళ్ల ప్రయాణం ముగిసింది.. వీసీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

Big Stories

×