BigTV English

Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?

Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?

Junior movie OTT:ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీ లీల (Sree Leela) ఇండస్ట్రీలోకి రాకముందు ‘జూనియర్’ అనే సినిమాకు సైన్ చేసింది. కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దాంతో ఆమె ‘పెళ్లి సందD’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసి రికార్డు కూడా సృష్టించింది. అయితే అందులో కొన్ని చిత్రాలు డిజాస్టర్ అవ్వగా.. మరికొన్ని చిత్రాల నుండి ఆమెను తీసివేశారు కూడా.. ఇంకొన్ని సక్సెస్ సాధించాయి. అలా కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో మళ్లీ తన మొదటి సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అలా గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటిరెడ్డి (Kireeti Reddy) హీరోగా పరిచయమైన చిత్రం జూనియర్.


సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చేసిన జూనియర్..

కాలేజీ బ్యాగ్ డ్రాప్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా.. జెనీలియా (Genelia) కీలక పాత్ర పోషించింది. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. థియేటర్లలో మోస్తారు టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం అటు ఆహా.. ఇటు అమెజాన్ ప్రైమ్ లో రెండింటిలో కూడా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది..

కన్నడ వెర్షన్ కూడా..

అసలే థియేటర్లలో ఒక మోస్తారుగా పేరు దక్కించుకున్న ఈ సినిమా అటు ఆహా వేదికగా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఇక్కడైనా ఈ సినిమా సత్తా చాటుతుందేమో చూడాలి. ఇకపోతే ఈ సినిమా కన్నడ వెర్షన్ నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది..


జూనియర్ సినిమా స్టోరీ

జూనియర్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. విజయనగరానికి చెందిన కోదండపాణి (రవిచంద్రన్ ) – శ్యామలా దంపతులకు అభి (కిరీటి రెడ్డి)ఆలస్యంగా పుడతాడు. కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కొడుకుకు అన్ని తానై పెంచుతాడు కోదండపాణి. తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడం, ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు కలిగిస్తూ ఉంటుంది. తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు. 60 ఏళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమరీస్ ఉండాలి కదా అని స్నేహితులతో కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అభి. అదే సమయంలో తోటి విద్యార్థిని స్ఫూర్తి (శ్రీ లీల) తో ప్రేమలో పడి, ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు.. అయితే మొదటి రోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య (జెనీలియా) కి ఇరిటేషన్ తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది. దాంతో ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు. అక్కడ అభి కి తెలిసిన నిజం ఏమిటి? విజయనగరంతో సౌజన్య కి ఉన్న సంబంధం ఏంటి? తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండపాణికి, విజయ సౌజన్య కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ALSO READ: Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Related News

OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

OTT Movie : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా

OTT Movie : భర్త చేతగానితనం… భార్యపై కన్నేసే మరిది… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : పందుల పైశాచికం… మనుషుల్ని పీక్కుతినే విడ్డూరం… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు మావా

OTT Movie : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×