Prabhas marriage : సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా కొన్ని టాపిక్స్ రిపీట్ గా ప్రస్తావన లోకి వస్తుంటాయి. అలాంటి టాపిక్స్ లో ప్రభాస్ పెళ్లి ఒకటి. ప్రభాస్ ఏజ్ ఉన్న హీరోలు, ప్రభాస్ కంటే తక్కువ ఏజ్ ఉన్న హీరోలు అందరూ కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అయిపోయారు. ఒకవైపు సినిమా లైఫ్ బిజీగా గడుపుతూనే మరోవైపు వైఫ్ ను కూడా సొంతం చేసుకున్నారు.
ప్రభాస్ విషయానికొస్తే పెళ్లి గురించి ఎప్పుడు పడితే అప్పుడే ప్రస్తావన వస్తుంది. దీని గురించి గతంలో స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి భార్య, స్వయాన ప్రభాస్ పెద్దమ్మ అయినా శ్యామలాదేవి పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. ఆవిడకు ఎప్పుడు మీడియాను ఫేస్ చేసిన ఎదురయ్యే ప్రశ్న ఒకటే, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఆవిడ కూడా దానికి సమాధానం చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి కూడా ఆ విషయం పైన ప్రస్తావని తీసుకొచ్చారు.
హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు. నేడు విజయవాడ కనక దుర్గమ్మ ను దర్శించుకొని వెళ్తున్న ఆమెను మీడియా వెంబడించారు. ఎప్పటిలాగానే పెళ్లి గురించి ప్రస్తావని తీసుకొచ్చి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా… ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని, అవి పూర్తైన తర్వాత చేసుకుంటారని తెలిపారు. అమ్మవారిని కూడా ఇదే విషయమై మొక్కుకున్నట్లు చెప్పారు. నిన్న రిలీజైన రాజాసాబ్ (The Raja Saab Trailer) ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని, సినిమా అలరిస్తుందని శ్యామలాదేవి మాట్లాడారు.
కొంతమంది లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి కాకుండా ఉండిపోతే చాలు ఇలానే డార్లింగ్ ని పూజిస్తాము అని అనుకుంటారు. ఇంకొంతమంది జెంట్స్ రెబల్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ కి త్వరగా పెళ్లయిపోయి ఒక ఇంటివాడు అయిపోతే బాగున్ను అనుకుంటారు. ఎందుకంటే తమ హీరో బాగోగులను చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే అది మంచిది అనేది వాళ్ళ అభిప్రాయం. మరి ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు తెలియాల్సి ఉంది.
మరోవైపు ప్రభాస్ సినిమా కెరియర్ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది అనడంలో సందేహం లేదు. మరి శ్యామలా దేవి గారి మాట ప్రకారం ఇంకో ఐదు సంవత్సరాల వరకు ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. కల్కి 2 (Kalki2), స్పిరిట్ (Spirit), ఫౌజి (Fouji) ఈ అన్ని సినిమాల మీద కూడా విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి.
Also Read: Pawan Kalyan OG : స్వయంగా ఓజి సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్, ట్రోల్స్ కు మళ్ళీ అవకాశం