Pawan Kalyan OG : ఎన్నో ఏళ్ల పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు సుజీత్ దర్శకత్వం దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా తెరతీసింది. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమి కోరుకుంటారో వాటన్నిటిని అద్భుతంగా సినిమాలో పొందుపరిచాడు సుజిత్.
పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమా వసూలు చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. అందులో మాత్రం సందేహం లేదు. కానీ వాళ్లను కలవర పెట్టిన విషయం ఒకటే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరు అని. పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు సినిమా టైంలో ఎటువంటి స్టేట్మెంట్ ఏ ఇచ్చారు. సినిమాలు చేస్తాను లేదో తెలియదు కానీ నిర్మిస్తాను అని.
ఓజి సినిమాను మెగా ఫ్యామిలీ అంతా కూడా నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అకిరా నందన్, ఆద్య తో కూడా ఈ సినిమాకు హాజరయ్యారు. వీళ్లు సినిమా చూసి భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. వీళ్ళతోపాటు తమన్, సుజిత్, రవిచంద్రన్, నవీన్ నూలి వంటి టెక్నీషియన్స్ కూడా సినిమాను చూశారు.
తన సినిమాలు మామూలుగా పవన్ కళ్యాణ్ చూసుకోరు. కానీ ఈ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలానే లూకింగ్ ఫార్వర్డ్ టు ఓజి యూనివర్స్ అంటూ కామెంట్ చేశారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఓ జి సీక్వెల్ లో నటించబోతున్నారు అని స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.
❤️🤞🏻 pic.twitter.com/mgrz37rMt8
— DVV Entertainment (@DVVMovies) September 30, 2025
పవన్ కళ్యాణ్ సినిమా వదిలేస్తాను అని పలు సందర్భాల్లో మాట్లాడిన మాట విదితమే. అప్పట్లో జనసేన పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయను అని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్వాల్వ్మెంట్ తో వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఒప్పుకున్న అన్ని సినిమాలు ఫినిష్ చేయాలి కాబట్టి దాదాపు చేసేసారు. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ టైం లో సినిమాలు చేస్తానో లేదో తెలియదు కానీ సినిమాలు నిర్మిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
కానీ ఇప్పుడు షో చూసిన తర్వాత లూకింగ్ ఫార్వర్డ్ ఓ జి యూనివర్స్ అంటే పవన్ కళ్యాణ్ మాట తప్పడు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ట్రోలింగ్ చేయడానికి దిగిపోతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆ ట్రోలింగ్ తిప్పి కొట్టడం కూడా లెక్క కాదు. హరిహర వీరమల్లు టైంలోనే తిప్పి కొట్టండి అంటూ పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా పిలుపునిచ్చారు.
Also Read: Srinidhi Shetty : చిన్న ఏజ్ లోనే అమ్మ చనిపోయింది, శ్రీనిధి నవ్వుల వెనక కన్నీటి గాథ