Lava Mobiles: లావా కొత్త లావా బోల్డ్ 5జి ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ అందరికి అందుబాటులో ఉండే విధంగా రూపిందించారు. ఇందులో ఉండే బలమైన లక్షణాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. కేవలం రూ.10,499 ధరకే లభించే ఈ ఫోన్, సాధారణంగా వాడుకునే వారికి 5జి అనుభవాన్ని సులభంగా అందిస్తుంది. లావా ఈ మోడల్‌ను ఏప్రిల్ 2025లో ప్రవేశపెట్టింది, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమోలేడ్ డిస్‌ప్లే
రూ.10,499 అందుబాటు ధరలో 5జి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప ఎంపికగా మారింది. లావా బోల్డ్ 5జి డిజైన్ సన్నని, ఆధునిక రూపంలో ఉంది. 6.67 అంగుళాల 3డి కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లే (ఎఫ్‌హెచ్‌డి ప్లస్ రెజల్యూషన్, 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్) క్లియర్, ప్రకాశవంతమైన చిత్రాలను అందిస్తుంది. వీడియోలు చూడటం, గేమ్‌లు ఆడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ సులభంగా జరుగుతాయి. స్క్రీన్ రెస్పాన్స్ వేగంగా ఉండటం వల్ల, బ్రౌజింగ్, టచ్ ఆపరేషన్‌లు సహజంగా ఉంటాయి. ఐపి64 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఫోన్‌ను రోజువారీ ఉపయోగానికి బలోపేతం చేస్తుంది.
6300 ప్రాసెసర్
ఈ ఫోన్‌కు 5జి సపోర్ట్ ప్రత్యేకంగా చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ (అక్టా-కోర్, 2.4GHz)తో బ్రౌజింగ్, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి భారీ పనులు సులభంగా చేస్తుంది. సోషల్ మీడియా యాప్‌లు, వీడియో కాల్స్, మూవీలు చూడటం అంతరాయాలు లేకుండా జరుగుతాయి. 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్‌లతో మల్టీటాస్కింగ్ స్మూత్‌గా పనిచేస్తుంది. 128జిబి స్టోరేజ్ (ఎక్స్‌పాండబుల్) ఫోటోలు, వీడియోలు, యాప్‌లకు తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది, ఇది బేసిక్ టాస్క్‌లకు అనుకూలం.
Also Read: Jio Phone 5G: అదిరిపోయే ఫీచర్లతో జియో 5జి ఫోన్ లాంచ్.. ధర చాలా చీప్ గురూ..
5000mAh బ్యాటరీ
బ్యాటరీ విషయంలో లావా బోల్డ్ 5జి నమ్మకమైనది. 5000mAh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు సాధారణ ఉపయోగానికి తగినంత శక్తిని అందిస్తుంది. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా ఉపయోగంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ ఫీచర్ బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను నియంత్రించి, ఎనర్జీని ఆదా చేస్తుంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఛార్జింగ్ సమయాన్ని తగ్గిస్తుంది.
సెల్ఫీ ప్రియులకు బెస్ట్ ఫోన్
కెమెరా పనితీరు సాధారణ సెల్ఫీ ప్రియులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. 64ఎంపి సోనీ సెన్సార్ (AI ఎన్‌హాన్స్‌మెంట్‌తో) రియర్ కెమెరా స్పష్టమైన, అద్భుతమైన షాట్‌లను అందిస్తుంది. 16ఎంపి ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనువైనది. రోజువారీ అవసరాలకు ఈ కెమెరాలు సరిపోతాయి, 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
ఇందులో UI ఉండటం వలన సులభంగా ఉపయోగించబడేలా రూపొందింది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (అండర్ డిస్‌ప్లే), ఫేస్ అన్‌లాక్ భద్రతను మెరుగుపరుస్తాయి. వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లు అదనపు సౌకర్యవంతంగా ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, సపాయిర్ బ్లూ, చాంపేన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లు ఫోన్‌ను ఆకర్షణీయంగా చేస్తాయి. బడ్జెట్‌లో 5జి కోరుకునే వారికి ఇది గొప్ప ఎంపిక. లావా ఈ ఫోన్‌తో భారతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.