Bigg Boss Promo: బిగ్ బాస్ సీజన్ 9 రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. సాదాసీదాగా కాకుండా చాలా పగడ్బందీగా ఒక్కొక్క ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. మామూలుగా ఒక కామనర్ ను ఇదివరకు హౌస్ లోకి పంపించేవాళ్లు. ఇప్పుడు మాత్రం సగం మంది సెలబ్రిటీలను సగం మంది కామర్స్ ను హౌస్ లోపలికి పంపించారు.
మరోవైపు కామనర్స్ కి, సెలబ్రిటీస్ కి మధ్య ఓనర్స్ అండ్ టెనెంట్స్ అనే గ్రూప్స్ ఇచ్చారు. వీళ్ళ మధ్య ఆసక్తికరమైన టాస్కులు జరుగుతున్నాయి. అలానే గ్రూప్ గేమ్ ఆడుతూనే ఎవరికి వారు వ్యక్తిగత గేమ్ కూడా ఈ షోలో ఆడుతున్నారు అని ఈజీగా అర్థమయిపోతుంది. ఇప్పటికే ఈ షో నుంచి ఇద్దరు కామనర్లు ఒక సెలబ్రిటీ బయటకెళ్ళి పోయారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఆమనర్ దివ్య నికిత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
మొత్తానికి నామినేషన్స్ డే మొదలైంది. కొద్దిసేపటి క్రితమే నామినేషన్స్ డే కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీజా దమ్ము… దివ్య నికితను డామినేట్ చేశారు. అయితే నామినేషన్ కి కారణంగా వచ్చినప్పటి నుంచి మీకు బెనిఫిట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పింది శ్రీజ.
దివ్య ఈ లోపు మాట్లాడబోతుంటే శ్రీజ మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను నేను చెప్పినప్పుడు నువ్వు విను అను రివర్స్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది దివ్య. మరోవైపు సంజనా కూడా దివ్య ను నామినేట్ చేసింది.
సంజనా దివ్య ను నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్, హౌస్ మేట్స్ అందరిని కూడా నువ్వు తోలుబొమ్మల ఆడిస్తున్నావు. అలానే వచ్చిన ఒక్క రోజులోనే నాకు కెప్టెన్ కి మధ్య గొడవ పెట్టావు అంటూ సంజన మాట్లాడటం మొదలుపెట్టింది.
దివ్య దానికి స్పందిస్తూ.. దీనిని నేను ఒక కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాను. నా చేతిలో ఈ 14 మంది హౌస్ మేట్స్ కూడా తోలుబొమ్మల ఆడుతున్నారు అంటే నేను దాన్ని కాంప్లిమెంట్ గానే తీసుకుంటున్నాను అంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చింది దివ్య. ఇంకొంచెం బట్టి చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ ఇంకొంచెం ఆసక్తికరంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది.
Also Read : Prabhas marriage : ప్రభాస్ పెళ్లిపై మళ్ళీ స్పందించిన శ్యామలాదేవి.. ఫ్యాన్స్ అసహనం!