E-Paper
Advertisement

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?
Advertisement

Suma: సుమ ..ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా ఈవిడగారిని కొట్టేవారే లేరంటే ఆశ్చర్యం లేదు.అంతలా తన మాటల ప్రవాహంతో షోలు,ఈవెంట్లని సందడిగా మార్చేస్తుంది మరి,ఇక సుమ తన యాంకరింగ్ తో ఏకంగా నెలకే పదిలక్షల పైనే సంపాదిస్తుందన్న టాక్ కూడా ఉంది.అలాంటి ఈ క్రేజీ యాంకర్ ఇప్పుడంటే సినిమాలు చెయ్యట్లేదు కానీ ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్లలో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిందన్న సంగతి మీకు తెలుసా ?

కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో మొదటిసారిగా హీరోయిన్ గా

Advertisement

అవును ..బుల్లితెర మహారాణి గా ఒక వెలుగు వెలుగుతున్న సుమ మొదటిసారిగా 1996లో  దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో మొదటిసారిగా హీరోయిన్ గా కనిపించింది.ఇక ఈ సినిమాలో సుమకి జోడీగా హీరో గా కనిపించిన వ్యక్తి ఇపుడు స్టార్ రైటర్ గా,డైరెక్టర్ గా సత్తా చాటుతున్న వక్కంతం వంశీ.అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో మళ్ళీ హీరోయిన్ గా డేర్ చేయలేకపోయింది సుమ.అది గనక హిట్ అయ్యి ఉంటె మనం ఒక మంచి యాంకర్ ని మిస్ అయ్యేవాళ్ళం కాబోలు.

Also read :‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

Advertisement

ఇక సినిమా పోవడంతో హీరోగా కనిపించిన వక్కంతం ఆ తర్వాత రైటర్ గా మారిపోయాడు.ముఖ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఆయన అందించిన కథలు ఇండస్ట్రీని షేక్ చేశాయి.‘అతనొక్కడే’,‘కిక్’,‘ఊసరవెల్లి’,‘రేసుగుర్రంవంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ లాంటిటెంపర్సినిమాకు కథ అందించింది వంశీయే.

ఆ తర్వాత మెగా హీరో అల్లు అర్జున్ నటించిననా పేరు సూర్య నా ఇల్లు ఇండియాసినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా, ఆ తర్వాత నితిన్‌తోఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్కూడా అదే బాటలో నడవడంతో కాసింత గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చే సినిమాకి కథ అందించే పనిలో పడ్డాడు.

సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం

ఇక సుమ విషయానికి వస్తే ..1974మార్చి 22,న కేరళ  జన్మించింది.ఇక ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది.అలా 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది.వీరికి ఒక బాబు, ఒక పాప.ఇక ఈ అబ్బాయే తాజాగా బబుల్ గమ్, మోగ్లీ సినిమాలతో అలరించిన రోషన్ కనకాల అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

ఇక సుమ తండ్రి పి.ఎన్.కుట్టి,తల్లి పి.విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటున్న కారణంగానే .సుమ తల్లిదండ్రులు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండటం వల్లే  తెలుగు భాషమీద పట్టు సాధించింది.

స్టూడెంట్ నెంబర్ వన్ఆడియో ఈవెంట్‌తోనే

ఇక  మొదట్లో కొన్ని పాపులర్ టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించిన సుమ ఆ తర్వాత మెల్లగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.అయితే ఆమె లైఫ్ టర్న్ అయింది మాత్రంస్టూడెంట్ నెంబర్ వన్ఆడియో ఈవెంట్‌తోనే అని చెప్పాలి. ఆ సినిమా ఫంక్షన్‌కె  తొలిసారిగా యాంకరింగ్ చేసింది సుమ. ఇక అలా మొదలైన ఆ యాంకరింగ్ ఇపుడే రేంజ్ కి వెళ్లిందో చెప్పక్కర్లేదు .

Related News

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×